👉 రైతుల పక్షాన ఏమైనా సమస్యలు ఉంటే పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలి !
👉 ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు వేగవంతం చేయాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా రైతుల నుండి చివరి గింజవరకు ధాన్యాన్ని కోనుగోలు చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, రాజ గౌడ్ లతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ …

ధాన్యం సేకరణలో మన జగిత్యాల జిల్లాకు సంబంధించి ఎంత ధాన్యాన్ని సేకరించారు అని అడిగి తెలుసుకున్నారు. మన జిల్లాలో వరి మీదనే ఎక్కువగా రైతులు ఆధార పడ్డారని, వారికి ఎటువంటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
👉 గన్ని బ్యాగులు, టార్పలిన్ కవర్లు, మరియు వివిధ రకాల యంత్రాలు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అధికారులను సూచించారు.
👉 అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిందని, తడిచిన ధాన్యాన్ని గంటలో అరబెట్టే మిషన్ ను జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి కి సంబంధించి 3 మిషన్లను కేటాయించడం జరిగిందని, అవసరమైతే ఇంకా తెప్పిస్తామని మరో 7 కు ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
👉 రైతులు నిబంధనల ప్రకారం ధాన్యం తీసుకువచ్చి తూకం అయిన తర్వాత ధాన్యం కు సంబంధించి పూర్తి బాధ్యత ఆ సెంటర్ ఇంచార్జులు, అధికారులు తీసుకోవాలని తెలిపారు.
👉 ధాన్యం రవాణాకు సంబంధించి మిల్లర్ల దగ్గర వాహనం ఆగిపోతే రైతుల బాధ్యత కాదని, మిల్లర్ల బాధ్యత అని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో క్లస్టర్ అధికారులు, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్ రెవెన్యూ ప్రతి రోజు సెంటర్లను సందర్శించాలని, సెంటర్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేలా సమన్వ యంతో పనిచేయాలని సూచించారు.
👉 అదనపు కలెక్టర్ రెవెన్యూ ప్రతి రోజు DSO, DCO, DM, DRDO మరియు DAO లతో రోజు వారి పర్యవేక్షణ చేయాలనీ కోరారు. సింగిల్ విండో ఛైర్మన్లను రైతులచే ఎన్నుకోబడతారు కావున వారికి రైతుల సమస్యల గురించి అవగాహన ఉంటుందని, ప్రభుత్వం సానుకూలంగా ఉండి చైర్మన్ పదవి కాలం పొడిగించిందని, ప్రతి సెంటర్ వద్ద సింగిల్ విండో చైర్మన్ లు ఉండే విధంగా చూడాలని కోరారు.
👉 సమస్యలకు తావు లేకుండా గ్రౌండ్ లెవల్ లో రైతుల పక్షాన ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
👉 అకాల వర్షాల వల్ల ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆలస్యం జరిగిందని, తడిచిన ధాన్యాన్ని, కలర్ మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
👉 ధాన్యం కొనుగోలు సజావుగా జరిగే విధంగా అధికారులు, నిర్వాహకులు, మిల్లర్లు, రవాణా కాంట్రాక్టర్లు అందరూ సమన్వయంతో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను విజయవంతం చేయాలనీ కోరారు.
👉 మళ్ళీ 15 రోజుల్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలనీ అంతలోపు ఇప్పటి వరకు ఎదురైనా సమస్యలను పరిష్కరించాలని సూచించారు. మార్క్ ఫెడ్ అధికారులతో సమీక్షించి మొక్కజొన్న రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రిగా నిత్యం అందరికీ అందుబాటులో ఉంటానని అందరు కలిసి సమన్వ యం తో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని కోరారు.
👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ …
.ప్రతి సంవత్సరం ప్యాడికి సంబంధించి తెలంగాణలో పెరుగుతుందని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోలు చేయాలి.
👉 కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ..
ఇప్పటివరకు రోజుకు 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, దానికి 15 వేల మెట్రిక్ టన్నుల వరకు పెంచితే ఆలస్యం కాకుండా వేగవంతంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. కౌలు రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు.
👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ..

ఈ సీజన్ లో 6 లక్షల వరకు ధాన్యం రావచ్చు అని అంచనా వేయడం జరిగింది, కానీ వర్షాల వల్ల సుమారు 4 నుండి నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల రావచ్చని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు మొత్తం జిల్లాలు 436 సెంటర్లకు గాను 394 ప్రారంభం అయ్యాయని తెలిపారు.
👉 ₹56 కోట్ల రూపాయల విలువ గల ధాన్యం కొనుగోలుకు సంబంధించి ₹28 కోట్ల రూపాయల విలువ వరకు రైతుల వివరాలను నమోదు చేయడం జరిగిందని, ఇప్పటికే ₹7 కోట్ల రూపాయాలలను రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు.
👉 ప్రతి మండలానికి స్పెషల్ ఆఫీసర్ తో పాటు క్లస్టర్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించామని వారు రైతుల వివరాల నమోదును పర్యవేక్షిస్తారని తెలిపారు.
👉 ధాన్యం 40 శాతం హార్వెస్టింగ్ జరిగి కల్లాలోకి వచ్చిందని, డిసెంబర్ 2 వ వారం లోగా కటింగ్స్ పూర్తి అవుతాయని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని తీసుకువచ్చేటప్పుడు వారి వివరాలను వెంటనే నమోదు చేస్తే నగదు తొందరగా 24-48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. రోజు రోజుకు ధాన్యం సేకరణ ను పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ట్రాన్స్ పోర్ట్ యజమానులు వాహనాల సంఖ్య పెంచాలని, మిల్లర్లు ఆన్ లోడింగ్ త్వరగా పూర్తి చేయాలనీ ఆదేశించారు.
👉 మొత్తంగా 436 సెంటర్లకు గాను 299 సెంటర్లు ప్యాక్స్, 136 సెంటర్లు ఐ.కె.పి., 1 సెంటర్ మెప్మా ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్యాక్స్ కి సంబంధించి 299 సెంటర్లలో గ్రేడ్- ఏ కి సంబంధించి 1 లక్షా 34 వేల 940 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 1280 క్వింటాళ్ల సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
👉 136 ఐ.కె.పి. సెంటర్లలో 6 లక్షల క్వింటాళ్ల ధాన్యానికి గాను ఒక లక్ష 60 వేల ధాన్యానికి మాయిశ్చరైజేషన్ జరిగి లక్ష క్వింటాళ్ల వరకు నగదును రైతుల ఖాతాలలో జమ చేశాం.
👉 అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ…
ధాన్యం కొనుగోలుకు సంబంధించి గన్ని బ్యాగులు, టార్పలిన్ లు, హార్వేస్టర్లు మరియు యంత్రాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
👉 హమాలీ కొరత వల్ల ఏర్పడుతున్న ఇబ్బందిని స్థానికంగా ఉన్న EGS ఉపాధి హామీ కూలీలను ఉపయోగించుకొని ప్రతి సెంటర్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేట్టు చూడాలని, ధాన్యాన్ని మిల్లుకు తీసుకువచ్చే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా మిల్లర్లు మరియు లారీ ట్రాన్స్ పోర్ట్ యజమానులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు.
👉 ఈ సమావేశంలో జగిత్యాల, మెట్ పల్లి ఆర్డీఓ లు మధు సుధన్, శ్రీనివాస్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిణి, వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు, క్లస్టర్ అధికారులు, ప్యాక్స్ చైర్మన్ లు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ సభ్యులు, ట్రాన్స్ పోర్ట్ అసొసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
