J.SURENDER KUMAR,
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని, మెజార్టీ కోసం ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ పాల్గొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, మంత్రులు శ్రీధర్ బాబు, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్, ఓటర్లను అభ్యర్థించారు.
ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధి వెంగళరావు నగర్ డివిజన్ శుక్రవారం రాత్రి రోడ్ షోలో పాల్గొన్నారు.

ముందుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడ మార్కెట్ ఏరియా ( కృష్ణా అపార్ట్ మెంట్స్ సమీపంలో) జరిగిన చేసిన కార్నర్ మీటింగ్ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మంత్రులు పాల్గొన్నారు.
