కార్పోరేట్ బ్యాంక్ లకు ధీటుగా గాయత్రి అర్బన్ బ్యాంక్ !

👉 ₹ 3647.67 కోట్ల వ్యాపారం దాటిన బ్యాంక్ !

👉 సీఈవో వనమాల శ్రీనివాస్ !

J .SURENDER KUMAR,

కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా డిజిటల్ సేవలను ప్రమోట్ చేస్తూ సహకార రంగంలో అభివృద్ధిని సాధిస్తున్నామని, ₹ 3647.67 కోట్ల వ్యాపారాన్ని బ్యాంక్ అధిగమించిందని, ది గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్, ముఖ్య కార్యనిర్వహణధికారి  వనమాల శ్రీనివాస్ తెలిపారు.

72 వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ది గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్., జగిత్యాల బ్యాంక్ ఆవరణలో ముఖ్య కార్యనిర్వహణధికారి  వనమాల శ్రీనివాస్  సహకార పతాకాన్ని ఆవిష్కరించారు.

అనంతరం బ్యాంక్ సమావేశమందిరం లో ప్రమోటింగ్ డిజిటలైజేషన్ అనే అంశంపై జరిగిన సమావేశంలో, సహకార శాఖ అధికారులు, బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ముఖ్య కార్యనిర్వాహణాధికారి  వనమాల శ్రీనివాస్, జనరల్ మేనేజర్లు శ్రీలత, బోగ రవీంధర్, పి.టి.ఎస్. శ్రీనివాస్, సి.హెచ్. కృష్ణా రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా సీఈఓ వనమాల శ్రీనివాస్  మాట్లాడుతూ…..

బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని వినియోగదారులకు డిజిటల్ విధానం ద్వారా పేమెంట్స్ ను సులభతరం చేయడం వల్ల మాత్రమే నిజమైన ఫైనాన్సియల్ ఇంక్లూషన్ ను సాధించగలుగుతామని అన్నారు.
ప్రత్యేకంగా సహకార రంగంలో డిజిటలైజేషన్ ప్రమేట్ చేయడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను విస్తరించవచ్చని అన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా, ది గాయత్రి బ్యాంకు అన్ని రకాల పేమెంట్ చానల్   UPI ACPS, IMPS, AIM NACH వంటి పేమెంట్ చానల్స్ విస్తృతంగా అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.

నూతనంగా డైరెక్ట్ RTGS, NEFT సేవలను లైవ్ చేసుకొని బ్యాంక్ స్వంత IFSC CODE (GABK000001) ను అందుబాటులోకి తేవడం జరిగిందని శ్రీనివాస్ అన్నారు.

సహకార వ్యవస్థలో భాగంగా, బ్యాంకింగ్ రంగంలో యూనిట్ బ్యాంకుగా 2000 సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన ది గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు తెలంగాణలో కో- ఆపరేటివ్ బ్యాంకులలో ₹ 3647.67 కోట్ల వ్యాపారంతో మొదటి స్థానానికి చేరుకున్నామని సీఈఓ శ్రీనివాస్ వివరించారు.

దక్షిణ భారతదేశంలో 8 లక్షల 53 వేల మంది వినియోగదారులను కలిగి బ్యాంకు మొదటి స్థానానికి చేరుకున్నామని అన్నారు.

వినియోగదారుల ఆర్ధిక తోడ్పాటుకు వ్యాపార రుణాలను, మార్ట్ గేజ్ రుణాలను, బంగారు ఆభరణాలపై రుణాలను, హౌసింగ్ రుణాలను, తదితర అన్నిరకాల రుణాలను తక్కువ వడ్డీకే అందిస్తున్నామని అన్నారు.

ప్రస్తుతం 67 బ్రాంచీలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తరించామని, త్వరలో మరో 14 బ్రాంచీలను ప్రారంభించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని తద్వారా 81 బ్రాంచీలతో 800 మందికి ఉద్యోగ కల్పన చేయగలుగుతున్నామని అన్నారు. బ్యాంక్ అభివృద్దికి సహకరిస్తున్న కేంద్ర మరియు రాష్ట్ర సహకార మంత్రిత్వశాఖ అధికారులకు సీఈవో వనమాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాంకు ఆవరణలో జరిగిన ఇట్టి కార్యక్రమానికి బ్యాంకు పాలక వర్గం, బ్యాంకు సిబ్బంది, సహకార సిబ్బంది మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.