ధర్మపురిలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం !

👉 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో..

J.SURENDER KUMAR.

ధర్మపురి టియుడబ్ల్యూజే (ఐజేయు) అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక ఫంక్షన్ హాల్ లో జాతీయ పత్రికా దినోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మధు మహాదేవ్, సభ్యులు సీనియర్ పాత్రికేయులను శాలువా మెమొంటోలతో సన్మానించారు
.

👉 ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, జై సురేందర్ కుమార్, ఎన్ లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ..


1966 నవంబర్ 16న ఆవిర్భవించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రోజును జాతీయ పత్రిక దినోత్సవముగా ప్రభుత్వం ప్రకటించింది అన్నారు. స్వయం ప్రతిపత్తి గల ఈ సంస్థ, వ్యక్తిగత ప్రతిష్టలకు భంగం కలిగించే వార్తలు ప్రచురించిన పత్రిక యాజమాన్యాలను, తప్పుడు వార్తలను రాసిన జర్నలిస్టులను, జర్నలిస్టులపై తప్పు కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వాలను శిక్షించే అధికారం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఉందన్నారు.

టీయూడబ్ల్యూజే యూనియన్ పక్షాన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా శిక్షణ తరగతులను నిర్వహిస్తూ వృత్తి నైపుణ్యాలను పెంపొందిస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లా  యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డితో చర్చించి త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

సీనియర్ జర్నలిస్టు లక్ష్మణ్ యాదవ్, ( రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు) సాగర్ ( V6 మంచిర్యాల జిల్లా స్టాపర్)  శ్రీమతి బత్తిని పవిత్ర ( జిల్లా కార్యవర్గ సభ్యురాలు) జె సురేందర్ కుమార్ ( రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు) సీనియర్ జర్నలిస్టులు  రాజేందర్, పాత శ్రీనివాస్ లను ప్రెస్ క్లబ్ సభ్యులు సన్మానించారు.