👉 ముంబైలోను ధర్మపురి క్షేత్ర వాసుల…..!
J SURENDER KUMAR,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లోని శ్రీ లక్ష్మీ గణేష్ రైస్ మిల్ ప్రాంగణంలో ఆదివారం కార్తీక వనభోజనం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ చరిత్రకారుడు, సాహిత్య వేత్త, రంగస్థలం నటుడు, తెలుగు కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంఘనభట్ల నరసయ్య, కార్తీక మోస విశిష్టతను పురాణ ప్రవచనం చేశారు.

రైస్ మిల్ యాజమాన్యం ఇనుగంటి వినోద్ రావు, వెంకటేశ్వరరావు, రంగ శంకరయ్య లు, వనభోజనం ఏర్పాటు చేశారు. స్థానిక శారదా మహిళా మండలి వారి పర్యవేక్షణలో ఉసిరిక చెట్టుకు ప్రత్యేక పూజలు, భోజనాల నిర్వహణ పర్యవేక్షించారు.


సుహాసిని మహిళలకు, ఆహుతులకు, సంభవనలు, దీప దానాలు, నిర్వాహకులు సమర్పించుకున్నారు.

👉 ముంబైలో ధర్మపురి క్షేత్ర వాసుల కార్తీక వనభోజన మహోత్సవం !

మహారాష్ట్ర ముంబైలో నివాసముంటున్న ధర్మపురి క్షేత్ర బ్రాహ్మణ సంఘ కుటుంబ సభ్యులు కార్తీక బహుళ పంచమి ఆదివారము కార్తీక దీప దానాలు, లలితా సహస్రనామ, రుద్ర పారాయణ, వనభోజనాలు, అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

కన్వీనర్ మధు మహాదేవ్ చైర్మన్ తాడూరి రాంప్రసాద్ , సహాయకులు బుగ్గారపు ప్రసాద్ శర్మ , పాలెపు కేదారనాథ్ ఆధ్వర్యంలో మహిళా సంఘం అధ్యక్షురాలు రావులపల్లి సమత కృష్ణ , బుగ్గారపు సుధ ప్రసాద్, తాడూరి యశోదర రాంప్రసాద్, ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణం ముంబైలోని గోరాయు ప్రాంతంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.


