👉 నేడు బ్రహ్మ పుష్కరిలో ( కోనేటిలో ) దీపాలంకరణ !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం బ్రహ్మ పుష్కరిణిలో ( కోనేరు ) బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం దీపాలంకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నది. ఈ కార్యక్రమం గత 20 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది.
2005 లో అప్పటి కార్యనిర్వహణాధికారి ( దేవాదాయ సహాయ కమిషనర్ ) కసజ్జుల శివరాం శర్మ, హయంలో కోనేటిలో దీపాలంకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నాడు వ్యాపారులను, భక్తులను, నూనె విరాళంగా సేకరించి పాఠశాల విద్యార్థులతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
