ధర్మపురిలో వైభవంగా పౌర్ణమి వేడుకలు!

👉 ధర్మపురికి పోటెత్తిన భక్తజనం !

👉  అంగరంగ వైభవంగా  బ్రహ్మ పుష్కరిలో ( కోనేటిలో ) దీపాలంకరణ !

J.SURENDER KUMAR,

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం లో బుధవారం అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరిగాయి. గోదావరి నదిలో పుణ్యస్నానాలు కోసం తెల్లవారుజాము నుంచే భక్తజనం క్షేత్రానికి రావడంతో నదితీర ప్రాంతం , ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.


కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం బ్రహ్మ పుష్కరిణిలో  దీపాలంకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్యలు కలగకుండా పోలీస్ యంత్రాంగం కృషి చేసింది.

👉 పౌర్ణమి నాటి ఆదాయ వివరాలు !

👉 టికెట్లు    ₹ 3,33,915 /-

👉 ప్రసాదాలు ₹ 4,23,800/-

👉 అన్నదానం ₹   61,303/-

👉 మొత్తం.₹ 8,19,018/-