👉 మహిళా రుణాల మంజూరులో ₹ 72 లక్షల నిధులు అవకతవకలు !
J SURENDER KUMAR,
ధర్మపురి మున్సిపాలిటీలో మహిళా స్వయం సహాయక సంఘాల, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ జలంధర్ రెడ్డిని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ గత రెండు రోజుల క్రితం సస్పెండ్ చేశారు.
👉 వివరాలు ఇలా ఉన్నాయి.
కోరుట్ల మున్సిపాలిటీలో జలంధర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్న సమయంలో మహిళా సంఘాల లింక్ నిధులు, వీధి వ్యాపారులకు రుణాల మంజూరు, తదితర అంశాల నిధుల అవకతవకలు. నేపథ్యంలో ₹ 72 లక్షల అవకతవకలు జరిగాయని, సస్పెన్షన్ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఈమేరకు అక్కడి పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 399/2024. నిధుల అవకతవకలకు బాధ్యుడైన జలంధర్ రెడ్డి పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వుల లో కలెక్టర్ పేర్కొన్నారు.
