👉 అంతుపట్టని ఆలయ అధికారుల ఆంతర్యం !
J.SURENDER KUMAR,
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి దాతలు లక్షలాది విలువ గల వస్తువులు, వేలాది రూపాయల వంట సరుకులు, ఉత్సవమూర్తులు, వెండి కిరీటం, ఫ్లడ్ లైట్స్ ఆలయానికి బహూకరిస్తున్న వారి పేర్లను, (దాతల) వాటి వివరాలను ఆలయ అధికారులు ప్రచార సాధనాలలో వాటి వివరాలు ప్రకటించడం లేదు. ప్రచార సాధనాల్లో నిత్యం ఆలయ ఆదాయం, పూజాది, సాంస్కృతిక కార్యక్రమాల వివరాలు ప్రకటించే యంత్రాంగం దాతల గూర్చి ప్రకటించకపోవడంలో ఆంతర్యం ఏమిటో ? అంతుపట్టడం లేదు.
👉 వివరాల్లోకి వెళితే…
లక్షలాది రూపాయల విలువగల వెండి కిరీటంను ఓ భక్తుడు శనివారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి సమర్పించుకున్నాడు. కార్యాలయంలో అధికారుల, భక్తుల , సమక్షంలో ఆలయానికి అప్పగించారు. వెండి కిరీటం విలువను, దాత పేరును ప్రకటించితే ఇతర భక్తులకు స్ఫూర్తిదాయకం అవుతుంది అనేది భక్తులలో చర్చ.

👉 గత వారం రోజుల క్రితం హైదరాబాదుకు చెందిన దాత వినోద్ అనే భక్తుడు వేలాది రూపాయలు విలువ గల ఫ్లడ్ లైట్స్ ను ఆలయ అధికారులకు అప్పగించారు. దాత పేరు, వాటి విలువ వివరాలు ప్రచార సాధనాలలో నోచుకోలేదు..

👉 మహారాష్ట్రకు చెందిన ” దిగుల్స్ ఫ్రెండ్స్” మిత్ర బృందం స్వామివారి నిత్యాన్నదానంలో భక్తులకు నాలుగు రోజులపాటు తీపి పదార్థం సిరా అందించడానికి తయారీకి కావలసిన (కాజు కిస్మిస్ పంచదార రవ్వ) నెల రోజులకు సరిపడే సామాగ్రిని అందించారు. సంవత్సర కాలం పాటు ప్రతినెల సరుకులు అందిస్తామని దిగుల్స్ ఫ్రెండ్స్ ఆలయ అధికారులకు వివరించినట్టు తెలిసింది.

👉 కొన్ని నెలల క్రితం ధర్మపురి క్షేత్రానికి చెందిన స్వర్గీయ ఓజ్జల జనార్ధన్ శాస్త్రి, స్వామివారి ఉత్సవమూర్తుల కోసం లక్షలాది రూపాయలను ఆలయ బాధ్యులకు బ్యాంకు ద్వారా బదిలీ చేసిన విషయం తెలిసిందే.

ఆ ఉత్సవమూర్తులు ఆలయానికి చేరుకున్నాయి అవి కాశి క్షేత్రంలో ఆలయ పక్షాన అంగరంగ వైభవంగా కళ్యాణం కోటి దీపోత్సవ కార్యక్రమంలో హైదరాబాదులో పూజాది కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే.. అయినా స్వామివారి ఉత్సవమూర్తులకు ఆర్థిక సహాయం చేసిన దాత పేరును మాత్రం ధర్మపురి ఆలయ యంత్రాంగం నేటికీ ప్రకటించకపోవడం ప్రత్యేకత.
