దాత పేరు మరిచిన ధర్మపురి ఆలయ అధికారులు !

J.SURENDER KUMAR,

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి లక్షలాది రూపాయల విలువ గల ఉత్సవ మూర్తుల విగ్రహాల దాత పేరును ధర్మపురి ఆలయ అధికారులు మరిచారు.

👉 వివరాల్లోకి వెళితే..

శ్రీ స్వామి వారి కళ్యాణం, ఊరేగింపు, ఇతర ప్రాంతాలలో స్వామివారి ఉత్సవాల కోసం ఆలయ అర్చకులు, వేద పండితులు, నిర్వహించే ధార్మిక కార్యక్రమాలు ఈ ఉత్సవ మూర్తులకు నిర్వహిస్తారు. కొన్ని నెలల క్రితం ధర్మపురి క్షేత్రానికి చెందిన స్వర్గీయ ఓజ్జల జనార్ధన్ శాస్త్రి,  స్వామివారి ఉత్సవమూర్తుల కోసం లక్షలాది రూపాయలను ఆలయ బాధ్యులకు బ్యాంకు ద్వారా బదిలీ చేశారు.

ఇటీవల కాశి క్షేత్రంలో కళ్యాణం జరిగిన ఉత్సవ మూర్తులు (దాత ఆర్థిక సహాయంతో కొనుగోలు చేసినవి ) (ఫైల్ ఫోటో)

ఇటీవల ఈ ఉత్సవమూర్తులకు  కాశి క్షేత్రంలో ఆలయ పక్షాన అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు.  ఎన్ టీవీ వారి కోటి దీపోత్సవ కార్యక్రమంలో హైదరాబాదులో స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను ఆంధ్రప్రదేశ్ తెనాలిలో తయారు చేసినట్టు తెలిసింది.

దాత ఆర్థిక సహాయంతో ఉత్సవమూర్తులు తెనాలిలో ( ఫైల్ ఫోటో)



ఆలయ అధికారులు దాత స్వర్గీయ జనార్ధన శాస్త్రి,  ఇచ్చిన లక్షలాది రూపాయల  వివరాలు ఆలయ రికార్డులలో నమోదు చేసి ఉండవచ్చు. 

అయితే భక్తులు అన్నదానం, ఇతర ధార్మిక కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చిన దాతలకు ధ్రువీకరణ పత్రాలు అందిస్తూ, స్వామి వారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదాలు అందించి ఘనంగా వేద ఆశీర్వచనం చేసి ప్రచార సాధనాలలో దాతల గూర్చి ఆలయ పక్షాన ప్రకటన జారీ చేస్తారు.

కొన్ని నెలల క్రితమే లక్షలాది రూపాయల విలువగల ఉత్సవమూర్తుల ఖర్చుల మొత్తాన్ని ఆలయా బాధ్యులకు బ్యాంకు ద్వారా బదిలీ చేసిన దాత స్వర్గీయ ఓజ్జల జనార్దన్ గూర్చి ఆలయ అధికారులు ప్రకటించకపోవడం లో. ఆంతర్యం ఏమిటో ? అంతు పట్టని మిస్టరీ. ఆలయ అధికారులు చర్యలతో దాత కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదన చెందుతున్నట్టు తెలిసింది.