👉 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో..
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J SURENDER KUMAR,
ఆత్మ బలిదానాలతో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు అనుభవించిన మనం తిరిగి వారి నిరంకుశ రాచరిక దొరల పాలన కావాలా ? ప్రజా పాలన కావాలా ? అనేది జూబ్లీహిల్స్ ఓటర్లు తీర్పు చెప్పనున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం సోమాజిగూడ డివిజన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ పి జె ఆర్ నగర్ షేక్పేట్ పలు కాలనీలు, వార్డుల్లో మంత్రి ఇంటింటి ప్రచారం చేశారు..

👉ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
2014–2023 మధ్య కేసీఆర్–కేటీఆర్ పాలనలో బస్తీల అభివృద్ధి జరిగిందా ? పది ఏళ్లుగా ప్రజలపై అప్పుల బారం మోపారు. ఇప్పుడు మనం ప్రజాపాలన తెచ్చుకున్నాం మార్పు కోసం మీరు కాంగ్రెస్‌కు ఓటు వేశారు అని మంత్రి అన్నారు.

అభివృద్ధి పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్లీ ప్రజలను మోసగించలేరని, మంత్రి అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు సార్లు ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్నారు — ఇదే ఆయన బలం. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా ఉంటుందన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనత కాంగ్రెస్‌దే. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్‌కే చెందింది. దళిత సీఎం అని చెప్పి, తానే కుర్చీలో కూర్చున్నాడు కేసీఆర్. కేటీఆర్, హరీష్‌లు సొంత చెల్లెలినే జైలుకు పంపించారు ఇలాంటి వారిని ప్రజలు ఎలా నమ్ముతారు అని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు.

అనంతరం మంత్రి అడ్లూరి షేక్‌పేట్‌లో జరిగిన దళితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు దేవినేని సతీష్, మేడి పాపయ్య, ఇటుక రాజు, మోజెస్, డా. జి.భరత్ , మాజీ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ.
కనకరాజు, రామచందర్, దామోదర్, నడిమింటి కృష్ణ, తగరం కృష్ణ, మహిళా నాయకులు రోజా రాణి, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
