ఫ్లాష్…కగార్ రాడార్ పరిధిలో గణపతి తిరుపతి కదలికలు ?


J.SURENDER KUMAR,

కగార్ ఆపరేషన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మావోయిస్టు దళాలు, నాయకులు, అగ్ర నాయకులు ఎన్కౌంటర్లో హతం అవుతున్న నేపథ్యంలో  మావోయిస్టు పార్టీ కీలక నేత ముప్పాల లక్ష్మణరావు @ గణపతి, ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పరి తిరుపతి, @ దేవుజీ కగార్ రాడార్ పరిధిలో ఉన్నట్టు చర్చ మొదలైంది.

దాదాపు వంద మంది అంగరక్షకులు ఐదు అంచల భద్రతతో సంచరించే మిలిటరీ కమాండర్ మోస్ట్ వాంటెడ్  హిడ్మా ను అదే స్థాయిలో భద్రత గల  నంబల కేశవరావు, తదితర అగ్ర నాయకుల కదలికలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  గుర్తించి వెంటాడి వారి స్థావరాలపై దాడులు చేసి హతమార్చిభద్రత దళాల కు గణపతి,  తిరుపతి కదలికల కోసం పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్టు చర్చ.

తిప్పరి తిరుపతి @దేవ్ జి. (ఫైల్ ఫోటో)

వారి మూమెంట్ భద్రతా దళాల రాడార్  పరిధిలో ఉన్నట్టు చర్చ మొదలైంది.   గణపతి తిరుపతి లను అరెస్టు చేస్తారా ? పోరు బాటలో వారు ఇద్దరు  కొనసాగుతారా ?  లొంగుబాటులోకి వస్తారా ? వేచి చూడాల్సిందే.