ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం!

J SURENDER KUMAR,

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్  మార్క్ లామీ  నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. హైదరాబాద్‌లో ఫ్రెంచ్ సంస్థల సహకారంతో అమలవుతున్న ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలంగాణలో పెట్టుబడులను విస్తరించాలని ఫ్రెంచ్ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలోని ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని బలోపేతం చేయడం ద్వారా ఇరుపక్షాల మధ్య మరింత సన్నిహిత సహకారం కొనసాగించవచ్చని సూచించారు.


👉 సమావేశంలో అలయన్స్ ఫ్రాన్స్ హైదరాబాద్ డైరెక్టర్ శ్రీమతి మౌద్ మిక్వా , ఫ్రెంచ్ బ్యూరో అసిస్టెంట్ శ్రీమతి రోహిణి రెడ్డిపల్లి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.