👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి సూచించారు.
👉 గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ , సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు.
👉 ఈ సమ్మిట్‌కు దేశ, విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించేందుకు ముందుగానే జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. సదస్సులో పాల్గొనే ఆహ్వానితులకు ఎక్కడా లోటు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

👉 ఈ సదస్సుకు హాజరు కావాలని ఇప్పటికే 2600 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు అందించామని సమావేశంలో అధికారులు వివరించారు. పెట్టుబడులకు సంబంధించి సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సూచించారు.
👉 విభాగాల వారీగా వివిధ అంశాలపై మాట్లాడేందుకు వక్తలకు సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, వక్తలకు సమయం ముందుగానే నిర్దేశించి క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో సీనియర్ ఐఏఎస్ అధికారిని బాధ్యుడిగా నియమించాలని సూచించారు.
👉 సమ్మిట్ కోసం ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ డిజైన్లను అధికారులు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం, పరిశ్రమలు, వైద్య రంగాలకు సంబంధించిన స్టాల్స్ విషయంలో సీఎం అవసరమైన జాగ్రత్తలను సూచించారు.
👉 సమ్మిట్ సందర్బంగా ప్రదర్శించే డ్రోన్ షో తెలంగాణ బ్రాండ్ ఇమేజీని పెంచే విధంగా ఉండాలని, అదే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సదస్సుకు సంబంధించి అన్ని డిజైన్లు నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
