గోదావరి నది పరిరక్షణ ఎజెండా గా కార్యక్రమాలు !

👉 గోదావరి మహా హారతి వ్యవస్థాపకుడు మురళీధర్ రావు !

J.SURENDER KUMAR,

రానున్న రోజులలో గోదావరి నది పరిరక్షణ, పరిశుద్ధంగా, నిరంతర ప్రవాహం ఉండేల ఏజెండాగా కార్యక్రమాల నిర్మాణం ఉంటుందని భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకుడు, గోదావరి మహా హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు   పోల్సాని మురళీధర్ రావు అన్నారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో గోదావరి నదికి ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా మహా హారతి ఉత్సవం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

ఈకార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ వైరాగ్య శిఖామణి అవధూత మహారాజ్  పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మహా మండలేశ్వర్, డాక్టర్ సిద్దేశ్వర నందగిరి మహారాజ్  పీఠాధిపతులు శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం భాగ్యనగర్ బర్దిపూర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మురళీధర్ రావు మీడియాతో మాట్లాడుతూ..

కేంద్ర మాజీ మంత్రి స్వాది ఉమా భారతి, ఆధ్వర్యంలో 14 సంవత్సరాల క్రితం ధర్మపురి నది తీరంలో ఆరంభించిన మహా హారతి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నదన్నారు. ప్రస్తుతం 35 నది ఘాట్లలో ఈ హారతి కార్యక్రమం జరుగుతున్నదని మురళీధర్ రావు అన్నారు.

గోదావరి నది పరిశుద్ధంగా కలుషితం కాకుండా ఉండాలి జీవనది నిరంతరం ప్రవాహంతో కొనసాగుతూ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ఉండాలి మార్పు కోరుకునే లక్ష్యంతోనే ఈ మహా హారతి కార్యక్రమం అని మురళీధర్ రావు అన్నారు.

మహా హారతి కార్యక్రమానికి భక్తుల, ప్రజల, సంఖ్య క్రమం క్రమంగా  పెరుగుతున్నదని, ఏర్పాట్లను అద్భుతంగా చేపట్టిన దామెర రామ సుధాకర్ రావు, వీరగోపాలను, కందాల నరసింహమూర్తిని, స్థానిక ఉత్సవ కమిటీ సభ్యులను మురళీధర్ రావు ప్రత్యేకంగా అభినందించారు.

గోదావరి మహా హారతి కార్యక్రమానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, కె.లక్ష్మణ్ సాయిని, ప్రత్యేక ఆహ్వానితునిగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు.

కార్యక్రమానికి ముందుగా నటరాజ రామకృష్ణ శిష్యుడు రతన్ కుమార్ శిష్య బృందం వారి పేరిణి తదితర  సాంప్రదాయాన్ని నృత్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హారతి కమిటీ నాయకులు, వీర గోపాల్, కే. వెంకటరమణారెడ్డి, వి . సంతోష్ రావు, రామ్ సుధాకర్ రావు, వేద పండితులు, తదితరులు వేదికనలంకరించారు.

బిజెపి నాయకుడు బండారు లక్ష్మణ్ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.