👉 డిసెంబర్ 3, 4 న నిర్మల్ జిల్లా ఖానాపూర్, జన్నారం ప్రాంతాలలో !
J . SURENDER KUMAR,
తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీ రూపకల్పనలో భాగంగా, గల్ఫ్ వలసలు, సమస్యలు, పరిష్కారాలపై సమగ్ర అధ్యయనం కోసం డిసెంబర్ నెలలో గల్ఫ్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు, తిరిగి వచ్చిన ఉద్యోగులు, గల్ఫ్ ప్రభావిత కుటుంబాలతో సమావేశమై వారి అనుభవాలు, సమస్యలు, అవసరమైన సమాచారం సేకరించనున్నట్లు వారు పేర్కొన్నారు. ముందుగా నిర్మల్ జిల్లా ఖానాపూర్, జన్నారం ప్రాంతాలలో డిసెంబర్ 3, 4 తేదీల్లో పర్యటన జరగనుంది.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, కార్మిక, ఉపాధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు, విద్యావేత్తలు, రిక్రూటింగ్ ఏజెన్సీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పర్యటనకు కావాల్సిన ప్రయాణ, వసతి తదితర ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
