హైదరాబాద్ ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులకు కేరాఫ్ కావాలి!

👉ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి!

J.SURENDER KUMAR,

అంత‌ర్జాతీయ సంస్థ‌ల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా హైద‌రాబాద్ నిలిచేలా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్  సమ్మిట్  నిల‌వాల‌ని ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి  అన్నారు. పెట్టుబ‌డిదారుల‌కు సంబంధించి అనుకూల అంశాలతో పాటు ప్రభుత్వం క‌ల్పించే స‌దుపాయాల‌ను సమ్మిట్ లో  స‌మ‌గ్రంగా వివ‌రించాల‌ని చెప్పారు.

👉 డిసెంబ‌రు 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీ  లో నిర్వ‌హించ‌నున్న స‌మ్మిట్‌కు సంబంధించి బ్రాండింగ్‌పై ముఖ్యమంత్రి మంగళవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు తో పాటు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

👉 గ్లోబ‌ల్ సమ్మిట్‌కు సంబంధించి వివిధ సంస్థ‌లు రూపొందించిన ప్ర‌చార చిత్రాలు, వీడియోలను  వీక్షించి ప‌లు మార్పులు చేర్పులు సూచించారు. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో విభాగాల వారీగా మ‌నం చేప‌ట్టే ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌తి అంశాన్ని ప్ర‌చారంలో ప్ర‌ముఖంగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించారు.

👉 పెట్టుబ‌డిదారుల‌కు హైద‌రాబాద్‌కు అనుకూలాంశాలైన ఇన్న‌ర్ రింగు రోడ్డు, అవుటర్ రింగు రోడ్డు, రానున్న రీజిన‌ల్ రింగు రోడ్డు, బంద‌రు పోర్ట్ వ‌ర‌కు నిర్మించ‌నున్న గ్రీన్‌ఫీల్డ్ హైవే, రైలు మార్గం, డ్రైపోర్ట్ తో పాటు తెలంగాణ‌లోని క‌ళా, సాంస్కృతిక, భాష, వాతావ‌ర‌ణ అనుకూల‌త‌ను వివ‌రించాల‌ని ముఖ్యమంత్రి  తెలిపారు.

👉 రాష్ట్రంలో 1999 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్ని ప్ర‌భుత్వాలు మారినా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాల్లో ఎటువంటి మార్పులేని అంశాన్ని, పెట్టుబ‌డుల విష‌యంలో మద్ద‌తుగా నిలుస్తున్న విష‌యాన్ని బ‌లంగా నొక్కి చెప్పాల‌ని సూచించారు.

👉 తెలంగాణ బ్రాండింగ్‌కు సంబంధించి మ‌న రాష్ట్రానికే ప‌రిమిత‌మైన, వైవిధ్య‌మైన‌ రామ‌ప్ప ఆల‌యంలోని నంది, స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర‌, న‌ల్ల‌మ‌ల్ల పులులు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకే ప్ర‌త్యేక‌మైన ఎద్దులు, తెలంగాణ నుంచి జాతీయ రాజ‌కీయాల‌ను శాసించిన పి.వి.న‌ర‌సింహారావు వంటి ప్ర‌ముఖులు, క‌ళాకారులు, క్రీడాకారులు, అంత‌ర్జాతీయ కంపెనీల‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ప్ర‌ముఖులు ఇలా ప్ర‌తి ఒక్క‌దానికి బ్రాండింగ్‌లో చోటు క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు. ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్‌, డిజిట‌ల్ వేదిక‌ల‌ను బ్రాండింగ్‌కు స‌మ‌ర్థంగా వినియోగించాల‌ని ఆదేశించారు.

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించిన డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క!

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంగళవారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిశారు. ఈ నెల 26న జరుగనున్న తన కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి కుటుంబ సమేతంగా రావాల్సిందిగా  మంత్రి  లక్ష్మణ్ కుమార్ ను ఆహ్వానించారు.