ఇది దొరల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ఇది దొరల ప్రభుత్వం కాదు, ప్రజల సంక్షేమానికి అంకితమైన ప్రజా ప్రభుత్వం  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి వర్గం, ప్రతి కుటుంబం అభివృద్ధి ఫలాలు పొందుతున్నాయని, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జూబ్లీహిల్స్ అసెంబ్లీలో యూసుఫ్‌గూడ ఎల్‌.ఎన్‌.నగర్‌లో బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దళిత నాయకులతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాల్సిందిగా కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….

మూడు సార్లు బీజేపీని, రెండు సార్లు బీఆర్ఎస్‌ను గెలిపించిన జూబ్లీహిల్స్ ఓటర్లు ఒక్కసారి ఆలోచించాలన్నారు.
“పది ఏళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం, మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. స్లమ్ ప్రాంతాల
పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇదే సాక్ష్యం అన్నారు.

ఇప్పుడా పార్టీ తిరిగి వస్తే ఏమి చేస్తుంది ? అని మీరు ప్రశ్నించాలనీ ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌, బీజేపీ రెండూ కలిసి కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నాయ ని ఎన్నికలో వారికి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కోరారు.

👉
అభివృద్ధి కి పనులకు  కేరాఫ్ జూబ్లీహిల్స్‌ !

జూబ్లీహిల్స్ లో ఇప్పటివరకు దాదాపు ₹400 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టాం. పేదలస్వప్నం   ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని వేగవంతం చేసాం అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అధికంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించారని” మంత్రి గుర్తుచేశారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించే దిశగా చర్యలు జరుగుతున్నాయని వివరించారు.

మహిళల స్వయం సహాయక సంఘాల బలోపేతంతో ఆర్థిక స్వావలంబనను కల్పిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్‌ పాలనలో ప్రజలు అనుభవించిన అవినీతి, అహంకారం ఇక మళ్లీ తిరిగి ఉండవు అన్నారు.


మా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం, నిబద్ధత, అభివృద్ధి అనే మూడు స్తంభాలపై నిలుస్తుంది” అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలే న్యాయనిర్ణేతలు. అభివృద్ధికి ఓటేయండి – విధ్వంసానికి కాదు. నవీన్ యాదవ్ విజయం అంటే ప్రజల గెలుపు. అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

👉 మార్నింగ్ వాక్ !

జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూసఫ్ గుడ LN నగర్ లో  నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరుతూ మంత్రి లక్ష్మణ్ కుమార్ మార్నింగ్ వాక్ లో గడపగడపకు ప్రచారం చేశారు.