J . SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలోని మండలాలతో పాటు కోట్ల నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కలెక్టర్ బి సత్యప్రసాద్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగరావు తో కలసి మంత్రి మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

ధర్మపురి అసెంబ్లీ పరిధిలోని ధర్మారం, ఎండపల్లి
కోరుట్ల నియోజకవర్గం మోహన్ రావు పేటలో చీరలను పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

రాష్ట్రంలో మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారని చెప్పారు.

రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాణ్యమైన చేనేత చీరలను ఉచితంగా అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాకు తొలి విడతలో 1,89,715 చీరలు వచ్చినట్లు వివరించారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు చీర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

మహిళా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ₹ 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ క్యాంటీన్లు, మహిళాసంఘాల కోసం రుణమాఫీ తదితర పథకాలను అమలు చేస్తోందని మంత్రి వివరించారు. చీరల పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకతతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి అన్నారు.
👉 కోరుట్ల నియోజకవర్గంలో…

కోరుట్ల మండలంలోనీ మోహన్రావుపేట శ్రీరామ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల ను మంత్రి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీజర్స్ ను మంత్రి అందజేశారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో మహిళా సోదరీమణులు పాల్గొన్నారు.
