ఇందిరమ్మ ఇంటిలో మంత్రి లక్ష్మణ్ కుమార్ భోజనం !

J.SURENDER KUMAR,

నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం అమలు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పూర్తయిన లబ్ధిదారుడి ఇంటిలో ఎస్సీ ఎస్టీ దివ్యంగా సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, సోమవారం భోజనం చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి !

గొల్లపల్లి మండల కేంద్రంలోని ఆవుల సాయవ్వకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి, సోమవారం నాడు గృహప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కూడా హాజరై కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

ప్రభుత్వం సంకల్పించిన “ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం” లక్ష్యంగా ఇందిరమ్మ పథకం వేగంగా అమలవుతోందని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లను మంజూరు చేయడంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా పనిచేస్తోందని చెప్పారు. ఇప్పటికే ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు నిర్మాణంలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేసి బిల్లులను పొందాలని సూచించారు.

గ్రామాల్లో ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభించని పక్షంలో, ఇతర అర్హులైన వారిని ఎంపిక చేసుకునే పరిస్థితి వస్తుందని మంత్రి హెచ్చరించారు. ఆవుల సాయవ్వ కుటుంబం గృహప్రవేశం చేసుకోవడం ఆనందదాయకమని పేర్కొంటూ, వారిని ఆదర్శంగా తీసుకొని మిగతా లబ్ధిదారులు కూడా తమ ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో  ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, సంబంధిత శాఖ అధికారులు  మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.