👉 పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల !
👉 కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగుతాయని అందుకు సంబందించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని నోడల్ ఆఫీసర్ లు ,ఆర్డీవోలు మరియు ఎంపిడివో లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. ఇందులో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి.రాజ గౌడ్ పాల్గొన్నారు.
👉 మొదటి విడత ఎన్నికలు…
మొదటి విడత స్థానిక ఎన్నికలు 7 మండలాల్లో మేడి పెల్లి,భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్ పెల్లి, మల్లాపూర్ మరియు ఇబ్రహీంపట్నం లలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
👉 రెండో విడత ఎన్నికలు…
జిల్లాలో రెండవ విడత స్థానిక ఎన్నికలు 7 మండలాల్లో రాయికల్,బీర్ పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్ ,మల్యాల,మరియు కొడిమ్యాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
👉 మూడో విడత ఎన్నికలు…
జిల్లాలో మూడవ విడత స్థానిక ఎన్నికలు 6 మండలాల్లో ధర్మపురి, బుగ్గారం , గొల్లపల్లి , వెల్గటూర్, ఎండపెల్లి మరియు పెగడపెల్లి లలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలకు సంబంధించి మాడల్ కోడ్ అఫ్ కండక్ట్ వెంటనే అమలులోకి వస్తుందని, ఎన్నికల నియమావళి ని సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఫ్లెక్సీ లు, మరియు స్టేషనరీ సంబంధించినవి బుధవారం మరొకసారి సరి చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు.
నామినేషన్ కేంద్రల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
బుధవారం స్టేజ్ -1 రిటర్నింగ్ అధికారులకు మరొకమారు శిక్షణ ఇవ్వాలని , రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఆర్డీవోలు మొదటి విడతలో నిర్వహించే 7 మండలాల్లో పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను, ఎన్నికలకు సంబందించిన సామగ్రి నిర్వహణను బుధవారం పరిశీలించాలని తెలిపారు.
ఎన్నికలకు సంబందించిన రిపోర్ట్ లు వెంటవెంటనే పంపించాలని ఎంపిడివోలను ఆదేశించారు.
