J.SURENDER KUMAR,
గల్ఫ్ దేశాలలో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన 31 మంది మృతుల ఒక్కో కుటుంబానికి ₹ 5 లక్షల చొప్పున ₹ 1 కోటి 55 లక్షల గల్ఫ్ ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం మంజూరి చేసిందని ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి ప్రకటనలో తెలిపారు.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా నిధుల విడుదలకు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వంతో చర్చించి నిధుల విడుదలకు కృషి చేశారని తెలిపారు.
31 మార్చి వరకు జిల్లాలో 50 మందికి ₹ 2.50 కోట్ల రూపాయల గల్ప్ ఎక్స్ గ్రేషియా చెల్లింపులు జరిగినాయి అని భీమ్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 165 గల్ఫ్ మృతుల కుటుంబాలు లబ్ది పొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రేస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని భీమ్ రెడ్డి తెలిపారు..
