👉 నిజామాబాద్ మంచిర్యాల్ 63 జాతీయ రహదారి !
👉 ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు !
J.SURENDER KUMAR,
నిజామా బాద్, జగిత్యాల, ధర్మపురి మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్-63 విస్తరణ పనులకు బ్రేక్ పడింది. పనులు నిలిపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ హైవే పేరిట పనులకు అనుమతులు మం జూరు చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మీదుగా జగిత్యాల-మంచిర్యాల వరకు మొత్తం 148.6 కిలోమీటర్ల పొడవున 63వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
గతంలో ఉన్న రోడ్డును విస్తరిం చడంతోపాటు అనుకూలంగా లేనిచోట కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమి సేకరించాలని నేషనల్ హైవే అథారిటీని ఆదేశించింది.
👉 గెజిట్ నోటిఫికేషన్ పై స్టే !

ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా 69వ
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రహదారి అలైన్మెంట్ గెజిట్ నోటిపికేషన్ పై ఈ నెల మూడున హైకోర్టు స్టే విధించినట్లు రైతుల పక్షాన హైకోర్టులో వాదిస్తున్న న్యాయవాది దొరిశెట్టి పోచయ్య తెలిపారు.
👉 న్యాయవాది పోచయ్య తెలిపిన వివరాల ప్రకారం..

జాతీయ రహదారి పనుల్లో భాగంగా జిల్లాలో మెట్పల్లి, కోరుట్లు. జగిత్యాల, ధర్మపురి పట్టణాలను తప్పిస్తూ కొన్ని కిలోమీటర్ల బైపాస్ రహదారని ప్రతిపాదించారు. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ కొనసాగు తోంది. అయితే విలువైన భూములు ఇవ్వడానికి కొందరు రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
బైపాస్ రహదారి అలైన్మెంట్ గెజిట్ నోటిఫికేషన్ ను రద్దు చేసి న్యాయం చేయాలని రైతులు
హైకోర్టును ఆశ్రయించారు. పీటీషనర్ల తరఫున వాదనలు విన్న హైకోర్టు.. నేషనల్ హైవే యాక్ట్ 1958 ఏ, సీ ప్రకారం అధికారులు వ్యవహరించలేదని పేర్కొంటూ అలైన్మెంట్ గెజిట్ నోటిఫికేషన్ పై స్టే ఉత్తర్వులు జారీ చేసిందని న్యాయవాది పోచయ్య తెలిపారు.
👉 నేషనల్ గ్రీన్ హైవే పనులు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ !

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల నుండి హాజీపూర్ మండలం ముల్కల్ల వరకు చేపడుతున్న నేషనల్ గ్రీన్ హైవే 63 రోడ్డు నిర్మాణం పనులు తాత్కాలికంగా నిలిపివేయాలని తెలంగాణ హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ హైవే ఆక్ట్ సెక్షన్ 3C ప్రకారం భూ నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందని హై కోర్టు అడ్వకేట్ దొరిశెట్టి పోచయ్య హై కోర్టు లో డబ్ల్యు పి. నం.35476/2024 రిట్ పిటిషన్ దాఖలు చేసి వాదనలు వినిపించారు.
నేషనల్ హైవే ఆక్ట్ సెక్షన్ 3C ప్రకారం వాదనలు సబబే అని భావించిన జస్టిస్ వినోద్ కుమార్ నేషనల్ గ్రీన్ హైవే నిర్మాణం పనులను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించారని న్యాయవాది దొరిశెట్టి పోచయ్య తెలిపారు.
👉 ఇది ఇలా ఉండగా…
కేంద్రం ప్రభుత్వం గత కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలోని నాలుగు జాతీయ రహదారులకు పచ్చజెండా ఉపింది. ఇందులో ఆర్మూర్- జగిత్యాల, జగిత్యాల కరీంనగర్, జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారులకు తాజాగా టెండర్లను ఆహ్వానించింది. ఆర్మూర్-జగిత్యాల జాతీయ రహదారిని 64. మీ. మేర ₹ 2538 కోట్లతో నిర్మించనున్నారు. మొత్తం 288.3 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సి ఉంది.
