జిల్లా కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతలు నందయ్యకే !

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షులుగా గాజంగి నందయ్యకే నాయకత్వ బాధ్యతలను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కట్ట పెట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన అభినంద సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పాల్గొని నూతన జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నందయ్య ను  శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు కలిగి ఉన్న నందయ్య, భార్య భారతి, పోలాస గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ సభ్యురాలుగా పనిచేశారు.  గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నందయ్య పై పలు కేసులు నమోదు చేసి, నాటి నాయకులు ఇబ్బందులకు గురి చేశారు.

మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.