👉 డిసెంబర్ 3న చలో హైదరాబాద్ !
J.SURENDER KUMAR,
జర్నలిస్టుల సమస్య సాధనకై డిసెంబర్ 3న హైదరాబాదులో నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా టి యు డబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు విరాహత్ అలీ కె.రాంనారాయణ తెలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన అక్రెడిటేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది. హెల్త్ కార్డులకు దిక్కులేదు. ఇక ఇళ్ల స్థలాలు అందని ద్రాక్షలా ఉన్నాయి. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని ఎన్నో సార్లు కలిసి చర్చించిన స్పందన లేదన్నారు.

గత 20 నెలలుగా అక్రెడిటేడేషన్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికి పాత అక్రెడిటేషన్ కార్డులను పలు దఫాలుగా రెన్యూవల్ చేస్తున్నారు తప్ప కొత్త కార్డులు ఇవ్వడం లేదు. ఇదేమని అడిగితే, ఇదిగో ,అదిగో అంటూ వాయిదాలు వేస్తున్నారు
తప్ప కార్యరూపం దాల్చటం లేదు. అని ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రభుత్వ సాచివేత ధోరణికి నిరసనగా డిసెంబర్ 3న, ఉదయం 10 గంటలకు మాసాబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద మహా ధర్నా నిర్వహించి మన ధర్మాగ్రహాన్ని ప్రభుత్వానికి తెలియజేయుటకు జర్నలిస్టులో పాల్గొని విజయవంతం చేయాలని ప్రకటనలో కోరారు.
