జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తా మంత్రి లక్ష్మణ్ కుమార్ !

👉 జర్నలిస్టు షఫీకి వైద్య ఖర్చులకు ₹ 50 వేల ఆర్థిక సాయం చేసిన మంత్రి  అడ్లూరి !

J.SURENDER KUMAR,

జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, అనారోగ్యానికి గురియే హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగిత్యాల పట్టణానికి చెందిన జర్నలిస్టు మమ్మద్ షఫీ కి ₹50 వేల ఆర్థిక సహాయంను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఆర్థిక సహాయాన్ని అందించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి  లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

తాను రాజకీయంగా ఎదగడానికి కారణమైన పాత్రికేయ మిత్రులను ఎప్పుడు మరిచిపోనని అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాత్రికేయులు తనకు ఎన్నో విధాల సహకరించారని గుర్తు చేశారు.

పాత్రికేయులకు ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాత్రికేయుడు షఫీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని తాను వ్యక్తిగతంగా హైదరాబాదులో ఆసుపత్రికి వెళ్లి యజమాన్యంతో మాట్లాడి త్వరగా శస్త్ర చికిత్స జరిగేలా చూడడం జరిగిందన్నారు.ఆసుపత్రి  వైద్య ఖర్చులను కూడా సాధ్యమైనంత మేరకు తగ్గించే ప్రయత్నం చేసినట్లు మంత్రి తెలిపారు. జర్నలిస్ట్ కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తాను ₹ 50 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తాను కిందిస్థాయి నుండి ఎదిగిన వ్యక్తినని, పాత్రికేయుల సాధక బాధకాలు తనకు తెలుసునన్నారు. పాత్రికేయులకు ఎలాంటి సమస్య వచ్చినా వాటిని పరిష్కరించడంలో ముందుంటానని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

అక్రిడేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డుల విషయంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశంతో మంత్రిగా ఎదిగానని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానన్నారు. జగిత్యాల ఎస్సీ హాస్టల్ విద్యార్థి హిమేష్ చంద్ర ప్రమాదవశాత్తు పిడుగుపాటుకు గురి కాగా తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకొని విద్యార్థి కుటుంబానికి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా ₹18 లక్షలు ఆసుపత్రి బిల్లు తన మంత్రిత్వ శాఖ ద్వారా చెల్లించినట్లు తెలిపారు.

*

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, సీనియర్ జర్నలిస్టు పిఎస్ రంగారావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి,  జిల్లా యూనియన్ నాయకులు గడ్డల హరికృష్ణ, హైదర్, సిరిసిల్ల వేణుగోపాల్, నరేష్, రాజిరెడ్డి, పవిత్ర,  సీనియర్ పాత్రికేయులు టీవీ సూర్యం, మల్లారెడ్డి, ఈసీ సభ్యురాలు పవిత్ర, అంజయ్య, మదన్మోహన్, ప్రదీప్, వంశీ, రాజేష్, నారాయణరెడ్డి, మారుతి, లక్ష్మణ్, సామ మహేష్, సట్ట శ్రీనివాస్ ఫజల్, ఇక్రమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.