జర్నలిస్టులపై దాడుల విచారణకు హై పవర్ కమిటీ!

👉 ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం !

J.SURENDER KUMAR,

జర్నలిస్టులపై దాడుల కేసులను విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం  హై పవర్ కమిటీ నియమిస్తూ ఈ నెల 4న జీవో నెంబర్ 219 న  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. హై పవర్ కమిటీ కి చైర్ పర్సన్ గా సమాచార,  ప్రజాసంబంధాల శాఖా మంత్రి కొనసాగుతారు.


హోం, పొలిటికల్, ప్రధాన కార్యదర్శి,G.A. (I&PR), పోలీస్ ఉన్నతాధికారులు. గుర్తింపు పొందిన  జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హైపర్ కమిటీలో సభ్యులు గా కొనసాగుతారు.
జర్నలిస్టుల సంఘాలుగా మొత్తం 8 మంది యూనియన్ ప్రతినిధులు కమిటీలో సభ్యులుగా ఉంటారు

హైపవర్ కమిటీ జీవో..

జర్నలిస్టులపై జరిగిన దాడుల తీరును, ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరిపి హై పవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది.


కమిటీ, సలహాలు, సూచనలు,  మేరకు పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. కమిటీ కాల పరిమితి నేటి నుంచి రెండు సంవత్సరాలు. గత ప్రభుత్వంలో ఇలాంటి హై పవర్ కమిటీ నియామకం జరగలేదు.