జర్నలిస్టు షఫీకి మెరుగైన వైద్యం అందించండి మంత్రి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

జగిత్యాల పట్టణం కు చెందిన జర్నలిస్టు షఫీఉద్ధిన్ కు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైద్యులకు సూచించారు.

అనారోగ్య బారిన పడి హైదరాబాద్ బంజారా హిల్స్ లోని రెనో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్టును  మంత్రి లక్ష్మణ్ కుమార్, బుధవారం ఆస్పత్రిలో పరామర్శించి, వైద్యులను జర్నలిస్టు ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. జర్నలిస్టు కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.

వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థికపరమైన అంశాలను వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా సహకరించడానికి కృషి చేస్తానని వారికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు.

ఇది ఇలా ఉండగా జర్నలిస్ట్ షఫీ  కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో జగిత్యాల పాత్రికేయుల బృందం జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు ద్వారా జర్నలిస్టు కుటుంబానికి కొంత  నగదు అందించారు.