👉 మూకుమ్మడిగా మద్దతు ప్రకటించిన మాదిగ దళిత సంఘాలు !
J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గీకరణ అంశంలో కట్టుబడి ముందడుగు వేసిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని మూకుమ్మడిగా మద్దతు ప్రకటించిన మాదిగ దళిత సంఘాలు మూకుమ్మడిగా మద్దతు ప్రకటిస్తున్నట్టు నాయకులు స్పష్టం చేశారు.
మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మాదిగ సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శాలివాహన నగర్‌లో జరిగిన ఈ సమావేశంలో మాదిగ దండోరా, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా, టి.ఎం.ఆర్.పి.ఎస్, ఉస్మానియా యూనివర్సిటీ టీజీ ఆర్‌ఎస్‌ఏ వంటి 9 దళిత సంఘాల ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
సమావేశానికి ఏఐసీసీ ఇంచార్జ్ విశ్వనాథ్, ఎమ్మెల్యేలు విజయ రామరావు, మక్కన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ హాజరయ్యారు.
👉 ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకుడు, ఎంపీ విశ్వనాథ్ మాట్లాడుతూ ……

జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పని చేయాలి, అని పిలుపునిచ్చారు.
👉 ప్రతి డివిజన్, వార్డు స్థాయిలో ప్రజలతో నేరుగా కలసి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
👉 ప్రచార కార్యక్రమాలను పద్ధతి ప్రకారం, రోజువారీ షెడ్యూల్ ఆధారంగా అమలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
👉 మాదిగ దండోరా నాయకులు మాట్లాడుతూ…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై చూపిన దృఢ సంకల్పం మాదిగ వర్గాలకు నూతన ఆశ కలిగించింది. అందుకే జూబ్లీహిల్స్‌లోని ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మేమంతా కృషి చేస్తున్నాం అన్నారు.
👉 రాబోయే రోజుల్లో దళిత వర్గాల ఓటర్లను ఒకే వేదికపై చేర్చి భారీ మాదిగ దండోరా సభ నిర్వహించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ఇటుక రాజు, దేవినేని సతీష్ , బాలరాజు, సత్యం తో పాటు ఆయ సంఘాల రాష్ట నాయకులు పాల్గొన్నారు.
