కొనుగోలు పారదర్శకంగా ఉండాలి మంత్రి లక్ష్మణ్ కుమార్!

👉 అధికారులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ కీలక సమీక్ష !


J.SURENDER KUMAR,

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు పారదర్శకంగా, వేగంగా ధాన్యం తరలించేలా  చర్యలు తీసుకోవాలని, సంక్షేమ శాఖ మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

ఆదివారం జగిత్యాల కలెక్టరేట్ భవనంలో  ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో  సివిల్ సప్లై అధికారులు, పలు జిల్లా అధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు.

కొనుగోలు కేంద్రాలలో నిలువలు, తరలించిన ధాన్యం, అధికారుల తనిఖీలు, తనిఖీలలో వెలుగు చూసిన అంశాలు తదితర అంశాలపై మంత్రి అంశాల వారీగా సమీక్షించారు.


👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికార యంత్రాంగం తో మాట్లాడుతూ..

ధాన్యం నష్టం జరగకుండా అన్ని కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది, తూకాల పరికరాలు, సిద్ధంగా వాహనాలు మరియు హమాలీలు సిద్ధం గా ఉంచాలని సూచించారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, సరఫరా, నిల్వలు, మిల్లింగ్ ప్రక్రియలు, ఎఫ్‌సీఐ తరలింపులు, రైస్‌మిల్లర్ల  వాహనాలు మరియు హమాలీలు వంటి అంశాలను సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

సమావేశంలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) బి.రాజ గౌడ్, డి. ఆర్. డి. ఓ రఘువరన్, డి. సి.ఓ మనోజ్ కుమార్ ,డి.ఎం జితేందర్ ప్రసాద్, జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.