👉 బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఇందిరా మహిళా శక్తి ద్వారా మా కాంగ్రెస్ ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంలో భాగంగా మహిళలను అన్నిరకాలుగా ప్రోత్సహిస్తుంది అని
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
మంగళవారం జగిత్యాల కలెక్టర్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మెగా ఋణ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ బి సత్యప్రసాద్ లు పాల్గొన్నారు.
👉 ఈ సందర్బంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఆద్వర్యంలో మహిళల సంక్షేమం కోసం మొదటి సంతకం మహాలక్ష్మి పథకం అమలు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను విద్య,వైద్యం మరియు మహిళాభివృద్ధికి ఇస్తుంది. మహిళలను ఆర్థికంగా అభివృద్ధిచేయాలనే ఉద్ధేశ్యంతో అన్నిరకాల పథకాలను మహిళల పేరుమీదనే అమలు చేస్తుంది.
ఇందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ,సన్న బియ్యం , మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం , 200 యూనిట్ల ఉచిత కరెంట్ ,సోలార్ పవర్ ప్లాంట్ లు ,పెట్రోల్ బంక్ , మహిళలకు వడ్డీ లేని ఋణాలు,అద్దెకు బస్సులు, ఉచిత స్కూల్ యూనిఫామ్స్ అందిస్తుంది .
మహిళలకు కు నైపుణ్య శిక్షణ ,సమావేశ నిర్వహణ కోసం, ₹5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం చేపట్టి త్వరలో పూర్తికాబోతున్నది . ఒక మహిళ వివధ స్థాయిల్లో ,వివిధ బాధ్యతల్లో ఎలా ఉంటుందో వివరించిన రీజనల్ హెడ్ కు ,ఒక సాదారణ మహిళా గా చిన్న షాప్ తో ప్రారంభించి ఋణాలు తీసుకుని సకాలంలో కడుతూ ఆర్థికంగా ఎదిగిన జిల్లా మహిళా అధ్యక్షురాలికి అభినంధనలు .

యూ బి ఐ బ్యాంకు మెగా ఋణమేళా ఏర్పాటుచేయడం అభినందనీయం జిల్లా ఇప్పటి వరకు తీసుకున్న ఋణాలు 100% ( 0% ఎన్ పి ఏ ) రీపేమెంట్ చేయడంలో రాష్ట్రంలో ముందంజలో ఉండటం మన జిల్లాకు గర్వకారణం.
మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ,బ్యాంక్ అందిస్తున్న రుణాలను సద్వినియోగ చేసుకొని ఆర్థికంగా వారి కుటుంబం అభివృద్ధి చెందాలని అందుకు మన జిల్లా మంత్రిగా , ఒక అన్నగా మహిళలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటానని తెలియజేశారు. అలాగే మహిళలకు మండల సమాఖ్య భవనాల ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
👉 జగిత్యాల ఎమ్మెలె సంజయ్ కుమార్ మాట్లాడుతూ..

ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ తరువాత బ్యాంకుల సధుపాయలు అందరికీ ముఖ్యంగా రైతులకు ,మహిళలకు అందుబాటులోకి తీసుకు రావడం జరిగింది . తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమ కోసం పాటుపడుతూ బ్యాంకుల ద్వారా అత్యధికంగా ఋణాలు అందిస్తుంది. సెర్ప్ ,మెప్మా ల ఆద్వర్యంలో యు బి ఐ ద్వారా మెగా ఋణమేళా ఏర్పాటు చేయడం అభినందనీయం .
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరియు యు బి ఐ ఆద్వర్యంలో మహిళల నైపుణ్య శిక్షణ కోసం తొందరగా ఏర్పాటు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ రాము ను కోరడం జరిగింది.
మహిళలు తమ స్వశక్తితో ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు .
👉 జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి ద్వారా కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడం ప్రభుత్వం లక్ష్యంలో భాగంగా మన జగిత్యాల జిల్లాలో మహిళా సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది .
జగిత్యాల జిల్లాలో 15,244 సంఘాలు ఉండగా , 1,77,055 మహిళా సభ్యులు ఉన్నారు . బ్యాంక్ లింకేజీ ద్వారా గత సంవత్సరం ₹720 కోట్ల ఋణాలు అందించగ ఈ సంవత్సరం ఋణ లక్ష్యం ₹ 770 కోట్లు కాగా ఇప్పటి వరకు 70 % సాధించగా,100% లక్ష్యాన్ని డిసెంబర్ లోగా పూర్తిచేస్తామని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి ద్వారా మన జిల్లాలో మహిళల ఆద్వర్యంలో 2 సోలార్ పవర్ ప్లాంట్లు ( జగిత్యాల, మేడిపెల్లి )
ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
అలాగే జిల్లా సంమాఖ్య ఆద్వర్యంలో కోరుట్ల పట్టణ సమీపంలో పెట్రోల్ బంక్ కోసం 10 గుంటల స్థలం కేటాయించడం జరిగింది.
మన జిల్లాలో 15 మండలల్లో ₹ 4.50 కోట్లతో 15 బస్సులు కొని RTC కి అద్దెకు ఇచ్చి ఒక్కో మహిళా సమాఖ్య ప్రతి నెల ₹ 69,768 రూపాయల ఆదాయం పొందుతూ ఇప్పటివరకు ₹42 లక్షల ఆదాయం పొందడం జరిగింది.
మన జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం IKP ఆద్వర్యంలో 136 కేంద్రాలను ఏర్పాటుచేయడం జరిగింది.
గత సంవత్సరం రెండు సీజన్లు కలిపి మహిళా సంఘాలు పొందిన కమీషన్ ₹7.17 కోట్లు కాగా ఈ సంవత్సరం కూడా మరింత కమిషన్ ఎక్కువ పొందే అవకాశం ఉంది.
మహిళలు మరింత ఉన్నతంగా ఆలోచించి బ్యాంకు ఋణాలు తీసుకొని రైస్ మిల్లులు ఏర్పటు చేసుకోవని సూచించారు.
ఈ సంవత్సరం 668 మహిళ సంఘాల ద్వారా 1,04,210 యూనిఫాం లు కుట్టి ₹ 78,79,750 రూపాయల ఆదాయం పొందడం జరిగింది. మహిళలకు శిక్షణ మరియు సమావేశాల నిర్వహణ కోసం ₹ 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా 3 నుండి 4 నెలల్లో పనులు పూర్తికాబోతున్నాయని తెలిపారు. మన జిల్లాలో యూ బి ఐ లీడ్ బ్యాంకు గా ఉండి మహిళ లకు అత్యధికంగా ఋణాలు అందించడం అలగే మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని 100% లోన్ తిరిగి కట్టడం జరుగుతుంది.
తద్వారా 0% NPA తో మనం జగిత్యాల జిల్లా రాష్ట్రంలో ముందంజంలో ఉండటం మనందరికి గర్వకారణం. ఇదే స్ఫూర్తి తో మహిళలు వివధ రంగాల్లో మరింతగా సక్సెస్ కావాలని కోరారు.
👉 DRDO రఘువరన్ మాట్లాడుతూ….
మన జిల్లాలో ఇందిరా మహిళా శక్తి ద్వారా బ్యాంక్ లు అందించే ఋణాలు మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించి రుణాలను సకాలంలో చెల్లించాలని కోరారు . ఇప్పటి వరకు మహిళా సంఘాల ద్వారా సాధించిన అభివృద్ధి ప్రగతిని వివరించారు. అనంతరం జిల్లా లోని 350 మహిళా సంఘాలకు ₹36 కోట్ల జంబో చెక్ ను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్ , డి అర్ డి వో రఘువరన్, యూ బి ఐ రీజనల్ హెడ్ అరుణ సవిత, డిప్యూటీ హెడ్ జయ కృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ హరిణి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రాము, ఏ వో మెప్మా శ్రీనివాస్, జిల్లా సమాఖ్య అద్యక్షురాలు సరోజాన, జిల్లా సమాఖ్య సభ్యులు, వివిధ పట్టణ, మండల మహిళా సమాఖ్య సభ్యులు , బ్యాంకు మేనేజర్లు, డి ఆర్ డి ఏ సిబ్బంది, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.
