👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాల నిషేధంపై సమాజం అంతా కలసి కట్టుగా పోరాడాల్సిన అవసరాన్ని ఎస్సీ ఎస్టీ దివ్యాంగ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గుర్తు చేశారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు–పట్టణాల ప్రతి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం పై అవగాహన మరియు ప్రతిజ్ఞ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….
విద్యార్థులు, యువత, అధికారులు అందరూ మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని, వాటి వ్యాప్తిని అరికట్టేందుకు కృషిచేసి సమాజంలో చైతన్యాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతోప్రతిజ్ఞ చేశారు
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.
