మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం !


👉 ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో…


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి సంతకం ఆరు గ్యారంటీ లో భాగంగా మహాలక్ష్మి పథకం అమలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం గా పనిచేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయో వృద్దుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్ అన్నారు.


మహిళా ఉన్నతి – తెలంగాణ ప్రగతి పేరిట ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లాలోని కలెక్టరేట్ లో ఆదివారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ లతో కలిసి ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగిందని తెలిపారు. మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ లు, పెట్రోల్ బంక్ లు, అమ్మ ఆదర్శ పాఠశాల లో భాగంగా పాఠశాల పర్యవేక్షణ మరియు మరమ్మతులు, స్కూల్ యూనిఫామ్ లు కుట్టడం, మహిళా శక్తి బజార్ లు మహిళకోసం అమలు చేస్తున్నామని ప్రతి జిల్లాలో మహిళలకు శిక్షణ మరియు నైపుణ్యత కోసం ₹ 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం ప్రారంభించి పూర్తిచేసుకోబోతున్నామని తెలిపారు.


ఇందిరా మహిళా శక్తి  పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీ శ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని వివరించారు. స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించామని అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని తెలిపారు. పండగ వాతావరణం లో జిల్లాలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.


ఒ అన్న చెల్లెకు అందించే కానుకగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి  అర్హులైన ప్రతి మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం రాబోవు కాలంలో మహిళల సంక్షేమం మరియు అభివృద్ధికై అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.


👉 ఈ సందర్బంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మట్లాడుతూ….


ఉక్కు మహిళా, భారత మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం చీరల ప్రారంభిచడం ఆనందంగా ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం ద్వారా అందిస్తున్న చీరలు అర్హులైన ప్రతి మహిళలకు అందించాలని కోరారు.


👉  జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మట్లాడుతూ..


రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో మొత్తం మహిళా సంఘాలు 15,244 ఉండగా అర్హులైన మహిళా సంఘ సభ్యులు 1,77,055 లతో కలుపుకొని తో అర్హులైన మహిళలు మొత్తం 2,35,439 మంది ఉన్నారు.
జిల్లాకు ఇప్పటివరకు 1,89,715 చీరలు రాగా ఈరోజు  వరకు 45,724 జిల్లాకు చేరతాయని తెలిపారు.


నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా,  మరియు గ్రామాల వారిగా ఉన్న ప్రత్యేక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు మరియు జిల్లా, మండల మరియు గ్రామ  మహిళా సమాఖ్యలు మరియు సెర్ప్ సిబ్బందిని సమన్యయం చేసుకోని తగు ప్రోటోకాల్ పాటిస్తూ పండగ వాతావరణం లో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని  విజయవంతంగా చేపట్టాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల ) బి. రాజ గౌడ్, డీఆర్డీఓ రఘువరన్, జగిత్యాల జిల్లా సమాఖ్య కార్యదర్శి ఆమని, జిల్లా స్థాయి అధికారులు, జిల్లా, మండల సమాఖ్య లు, సెర్ప్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.