మహిళలను ఆర్థిక మహారాణులను చేస్తున్నాం మంత్రి శ్రీధర్ బాబు!

J.SURENDER KUMAR,

మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసి మహారాణులను చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

ఆదివారం కాటారం మండల కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో  మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

👉 ఈ సందర్భంగా మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన మహిళ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఆయన పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

👉 దేశ ఉక్కు మహిళగా పేరు తెచ్చుకున్న శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా స్వయం సహాయక సంఘాల  మహిళలకు ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.


👉 ఈకార్యక్రమం ద్వారా మహిళల గౌరవం కాపాడే విధంగా నాణ్యమైన చీరలు అందిస్తున్నామన్నారు.

👉 ఆడబిడ్డలకు చీర సారె ఇచ్చి గౌరవించుకోవడం తెలంగాణ సాంప్రదాయమని కాబట్టి ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరలు అందిస్తుందని అన్నారు.

👉 మహిళలు వృద్ధిలోకి రావాలనే లక్ష్యంతో  ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని  మహిళలు సంతోషంగా ఉంటే వారి కుటుంబం తద్వారా రాష్ట్రం కూడా సంతోషంగా ఉంటుందని తెలిపారు.

👉 మహిళల వృద్ధికి తోడ్పాటు అందించేందుకు  మహిళ శక్తి కార్యక్రమం ద్వారా వడ్డీ లేని రుణాలు, పెట్రోల్ బంకులు, బస్సులు, మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ ఇళ్లు, పాడి పరిశ్రమలు, మహిళా శక్తి క్యాంటీ లు, వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాలు  ఏర్పాటు ద్వారా వ్యాపారంలో మెలకువలు చేస్తున్నామని అన్నారు.

👉 మహిళ చేతిలో రూపాయి ఉంటే పొదుపు పెరుగుతుందని ఇతరులకు అప్పులు ఇచ్చే స్థాయిలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్య మంత్రి ఏ రేవంత్ రెడ్డి లక్ష్యమని అన్నారు. ఇందిరా మహిళ శక్తి చీరలు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో  మహిళ సమాఖ్యలు ద్వారా  ప్రతి మహిళకు చేరుతాయని తెలిపారు.

👉 మైలాన్ అనే సంస్థ ద్వారా సి ఎస్ ఆర్ నిధుల నుండి ఈ ఐదు మండలాల మహిళలకు కుట్టు మిషన్లు శిక్షణ కార్యక్రమం చేపట్ట బోతున్నామని,  ఇప్పటికే మహదేవ్ పూర్ మండల కేంద్రంలో ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అన్నారు.

👉 ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతంగా లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు.  ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

👉 జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు.

👉 జిల్లాలో మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళ శక్తి బస్సులు, మహిళా సమాఖ్యలలోని సభ్యులైన మహిళలకు కుట్టు మిషన్లు అందించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్ లు సైతం మహిళలే కుట్టి అందిస్తున్నారని అన్నారు.

👉 భూపాలపల్లి, కాటారం డివిజన్లలోని అన్ని మండలాలకు ఒకటి చొప్పున మహిళా శక్తి పెట్రోల్ బంకులు ఏర్పాటుకు స్థల సేకరణ జరుగుతుందని తెలిపారు. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

👉 ఈ కార్యక్రమంలో  ఎస్పి సంకీర్త్, ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్,  విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్,  జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ రాజబాబు,  రాష్ట్ర ఉపాధి హామీ పథకం సభ్యులు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల సమ్మయ్య, సింగిల్ విండో ఛైర్మన్
మొండెయ్య తదితరులు పాల్గొన్నారు.