👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J . SURENDER KUMAR,
రాష్ట్రంలోని మూడు లక్షల యాబై వేల (3,5000)
మహిళా సంఘాలకు ప్రభుత్వం ₹ 304 కోట్ల రూపాయల వడ్డీ లేని ఋణాలు విడుదల చేసిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ వికలాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
పెగడపల్లి మండల కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గం లో మంగళవారం వడ్డీలేని ఋణాల పంపిణీ కార్యక్రమం ప్రారంభంతో పాటు, ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
2025-26 వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,825 స్వయం సహాయక సంఘాలకు ₹10.69 కోట్లు వడ్డీ లేని ఋణాలు విడుదల అయ్యాయని తెలిపారు.

👉 మహిళలు ఆర్థికంగా మరియు అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు.
స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సంధర్భంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పథకం ప్రారంభించి అందిస్తున్న చీరల రంగు, డిజైన్లు చాలా బాగున్నాయని మహిళలు పేర్కొనడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.
👉 రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకున్న అర్హులైన లబ్ధిదారులకు వారికి నేరుగా ₹ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 10853 ఇండ్లు మంజూరు అయ్యాయని, కొంతమంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహ ప్రవేశ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించడం సంతోషం అన్నారు.
👉 ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న, ఆన్లైన్ లో దరఖాస్తు, నేరుగా నాకు గాని, జిల్లా కలెక్టర్ కు గానీ దరఖాస్తులు ఇచ్చినవారికి అర్హులైన వారిని ఎంపిక చేసి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని మంత్రి అన్నారు.

👉 రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడవాలని, మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్ప బలంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అని, మంత్రి అన్నారు.
👉 ప్రజా ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అనగా మహాలక్ష్మి పథకం, ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు, ₹ 500/- రూపాయలకు సిలిండర్, రేషన్ కార్డులు, 6 కిలోల సన్న బియ్యం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
👉 మీ మద్దతుతో మా ప్రజా ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందిస్తామని తెలిపారు.
👉 కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ..
రాష్ట్ర ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉదేశ్యంతో ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను మహిళలలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వడ్డీ లేని రుణాల పంపిణీ గురించి మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించాలని తెలిపారు.

తదనంతరం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కును అందించారు. ఈ కార్యక్రమలో ఆర్డీవో మధుసుధన్, డీఆర్డీవో రఘువరన్ , ఎమ్మార్వో, ఎంపీడీవో , స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
