మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సిబిఐ నోటీసులు ?

👉 న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో ..

J.SURENDER KUMAR.

నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో  మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

ఫిబ్రవరి 17, 2021న జరిగిన న్యాయవాద దంపతుల దారుణ హత్య, దోషులకు కఠినమైన శిక్ష పడేలా నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాద వర్గాల్లో విస్తృత ఆగ్రహాన్ని కలిగించింది. జంట హత్యలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని మంథని బార్ అసోసియేషన్ గతంలో కోరింది.

న్యాయవాద దంపతులను 17 ఫిబ్రవరి 2021 లో నరికి చంపుతున్న దృశ్యం ( ఫైల్ ఫోటో)

బెదిరింపు కాల్స్ వచ్చిన న్యాయవాది దంపతులకు రక్షణ కల్పించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ‘విఫలం’ అయిందని ఆరోపిస్తూ, జంట హత్యల కేసుపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలని అప్పటి ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.


కుట్ర దారులను టిఆర్ఎస్ ప్రభుత్వం  తప్పించిందని వామన్ రావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణకు అభ్యర్థించారు.. సుప్రీంకోర్టు వాదనలు ప్రతి వాదనల  అనంతరం ఆగస్టు మాసంలో న్యాయవాద దంపతుల హత్య కేసును సిబిఐ విచారణకు ఆదేశించింది.

హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న సిపిఐ అధికారులు(ఫైల్ ఫోటో)

హైకోర్ట్ అడ్వకేట్స్ నాగమణి, వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణ చేపట్టిన సిబిఐ సంఘటన స్థలాన్ని వామన్ రావు స్వగ్రామం గుంజపడు, మంథని కోర్టు ప్రాంగణాన్ని సెప్టెంబర్ లో పరిశీలించారు.

మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావుతో పాటు, వారి కుటుంబీకులు, బంధువులు, పలువురిని సీబీఐ విచారించింది.
వాంగ్మూలం సేకరణ..

వామన్ రావు దంపతుల హత్య కేసులో సిబిఐ అధికారులు సెప్టెంబర్ మాసంలో  ఖమ్మంపల్లికి చెందిన బొల్లంపల్లి సంతోష్, మంథని పట్టణ మాజీ ఉప సర్పంచ్, హై కోర్టు అడ్వకేట్ ఇనుముల సతీష్ లను విచారించి వారి వాంగ్మూలాలను రికార్డు చేశారు.

వామన్ రావు స్వగ్రామం గుంజపడుగులో సిబిఐ అధికారులు (ఫైల్ ఫోటో)

వీరిద్దరిని వేర్వేరుగా రామగుండం కమిషనరేట్ లో సీబీఐ విచారణ బృందానికి ప్రత్యేకంగా కెటాయించిన కార్యాలయంలో విచారించారు. గట్టు వామన్ రావుతో వీరికి ఉన్న సంబంధాలు, ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం, హత్యకు ముందు, తరువాత చోటు చేసుకున్న పరిణామాల అడిగినట్టుగా సమాచారం.

హత్యకు గురి అయిన న్యాయవాద దంపతులు (ఫైల్ ఫోటో)


వామన్ రావు దంపతుల హత్యకు ఆరు నెలలకు ముందు జరిగిన పరిణామాలు, వామన్ రావు బాధితు సంఘం పేరిట ఏర్పాటు చేసిన వాట్సప్ గ్రూపు గురించి కూడా తనను అడిగారని వారు వివరించారు.  హైకోర్టులో వేసిన పిల్ పిటిషన్ల గురించి కూడా సీబీఐ అధికారులు సమగ్రంగా అడిగారన్నారు. సంతోష్, సతీష్ లను దాదాపు మూడు గంటల పాటు విచారించినట్టుగా తెలిసింది.