J SURENDER KUMAR,
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గా ఘన విజయం సాధించిన నవీన్ కుమార్ యాదవ్, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్, కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్, హార్ట్లి కంగ్రాట్స్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అంటూఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను ఆలింగనం చేసుకున్నారు.

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ విజయానికి కీలక భూమిక పోషించిన ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు కృతజ్ఞతలు ఆదివారం హైదరాబాదులో మంత్రి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వచ్చారు.

సోమాజిగూడ డివిజన్ పరిధిలో మీరు నా గెలుపు కోసం అంకితభావం, కఠిన శ్రమ ఫలితంగా నాకు అధిక మెజార్టీ లభించిందని, తన విజయంలో కీలక పాత్ర పోషించినందుకు మంత్రి కి ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్ ఆదివారం హైదరాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

మీరు, మీ అనుచరగణం, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, నా గెలుపు కోసం చేసిన కృషిని మరువలేనని మీ రుణం తీర్చుకోలేను అంటూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, మంత్రి లక్ష్మణ్ కుమార్ కు శాలువా కప్పి పూల చెట్టు అందించారు.
