మంత్రి లక్ష్మణ్ కుమార్ మానవీయం – విద్యార్థి కి పునర్జీవనం !

👉 పిడుగు తాకిడితో గాయపడిన విద్యార్థికి లక్షలాది రూపాయల కార్పొరేట్ వైద్యం !

👉 నా కొడుకు ప్రాణం కాపాడింది ప్రభుత్వంమే విద్యార్థి తండ్రి శ్రీనివాస్ !

J . SURENDER KUMAR,

పిడుగు తాకిడితో గాయపడిన హాస్టల్ విద్యార్థి కి  లక్షలాది రూపాయలు వ్యయం చేసి హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో నెల రోజులకు పైగా వైద్య చికిత్స అందించిన సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మానవీయ కోణంతో చొరవ తీసుకొని చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ విద్యార్థి కి మంత్రి ప్రభుత్వ పక్షాన పునర్జీవనం ప్రసాదించాడు.


👉 వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపు ఎస్సీ బాలుర వసతిగృహం పై గత సెప్టెంబర్‌లో పిడుగు పడటంతో విద్యార్థి బొల్లె హిమేష్ చంద్ర  (8వ తరగతి) తీవ్రంగా గాయపడ్డాడు. వసతి గృహం టెర్రస్‌పై ఆరేసిన దుస్తులు తీసుకురావడానికి వెళ్లిన హిమేష్ పరిసరాలలో  పెద్ద శబ్దంతో పిడుగు పడింది. క్షణాల్లోనే మంటలు వ్యాపించి, అతని చేతులు, వెన్ను తీవ్రంగా కాలిపోయాయి.

వసతిగృహ సిబ్బంది గాయపడిన విద్యార్థిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి, తరలించారు.  పరిస్థితి విషమించడంతో అక్కడినుండి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి హిమేష్ చంద్ర ( ఫైల్ ఫోటో)

మొదట ట్రాన్స్‌ఫార్మర్ పేలిందని భావించిన అధికారులు, విద్యుత్‌ శాఖ ఏఈడీ జవహర్‌లాల్ నాయక్‌ పరిశీలనలో — భవనంపై నేరుగా పిడుగు పడినట్లు నిర్ధారించారు.

👉 సకాలంలో స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ !

యశోద ఆసుపత్రిలో విద్యార్థి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న మంత్రి లక్ష్మణ్ కుమార్(ఫైల్ ఫోటో)

విద్యార్థి గాయపడిన సమాచారం తెలిసిన   సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సకాలంలో స్పందించారు. విద్యార్థికి మెరుగైన వైద్య సేవలకు ఎన్ని లక్షల రూపాయలైనా ప్రభుత్వం చెల్లిస్తుందని వసతి గృహ నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి ఆరోగ్య పరిస్థితితో పాటు వారి కుటుంబ సభ్యులకు వసతుల కల్పన కోసం మంత్రి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు.

👉 యశోద ఆసుపత్రికి పలుమార్లు..

యశోద ఆసుపత్రిలో సంక్షేమ శాఖకు చెందిన ప్రత్యేక అధికారితో విద్యార్థి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న మంత్రి (ఫైల్ ఫోటో)


మంత్రి లక్ష్మణ్ కుమార్ యశోద ఆసుపత్రికి  తన సిబ్బంది తో వెళ్లి విద్యార్థి ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి పురోగతిని వైద్యులతో సంప్రదించారు. మెరుగైన వైద్యం అందించేలా ఎప్పటికప్పుడు ఆయన వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు

👉 వైద్యానికి ప్రభుత్వ నిధుల నుండి ₹ 18 లక్షలు !

ఆస్పత్రిలో నెలరోజులకు పైగా చికిత్స అందించి, విద్యార్థికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. వైద్య చికిత్సలకు  దాదాపు ₹18 లక్షలు కావడంతో,  కడు బీద కుటుంబం భరించలేని స్థితి దుస్థితిని గుర్తించిన మంత్రి  వైద్య ఖర్చును సంక్షేమ శాఖ (SCDD) నిధుల నుండి చెల్లించాలంటూ SCDD కమిషనర్ క్షితిజకు మంత్రి జారీ చేసిన ఆదేశాలతో యశోద ఆసుపత్రికి ప్రభుత్వం చెల్లించింది.

👉 నా కొడుకు ప్రాణం కాపాడింది మంత్రి లక్ష్మణ్ కుమార్  ప్రభుత్వం !

మీడియాతో మాట్లాడుతూ రోధిస్తున్న విద్యార్థి తండ్రి శ్రీనివాస్.

నా కొడుకు హిమేష్ ప్రాణాలు కాపాడింది మంత్రి లక్ష్మణ్ కుమార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని తండ్రి బొల్లె శ్రీనివాస్ కన్నీటిపర్వంతో మీడియాతో మాట్లాడారు.

జీవనోపాధి కోసం గల్ఫ్ దేశంలో కూలీగా పనిచేస్తున్న శ్రీనివాస్ కు పిడుగు తాకిడితో గాయపడిన హిమేష్ చంద్ర గూర్చి తెలియడంతో హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. విద్యార్థి హిమేష్ చంద్రది జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మధుట్ల