J.SURENDER KUMAR,
సింగరేణి కార్మిక సమాఖ్య ( సికాస) ఆర్గనైజర్ కొయ్యడ సాంబయ్య,@ ఆజాద్, ఆర్గనైజర్ అశోక్ రేపో మాపో, ప్రభుత్వానికి లొంగిపోనున్నట్టు తెలిసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపుమేరకు వారు జనజీవన స్రవంతిలో కలవడానికి అంగీకరించినట్టు సమాచారం. ఇంటిలిజెన్సీ, పోలీస్ వర్గాలు వీరి కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించి కౌన్సిలింగ్ చేసినట్టు సమాచారం. వీరి లొంగుబాటును పోలీస్ వర్గాలు, ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
మావోయిస్టు పార్టీ మిల్టెంట్ కార్మిక సంఘమే సింగరేణి కార్మిక సమాఖ్య. ఇది ఇలా ఉండగా గత నెలలో సికాస కార్యదర్శి మోస్ట్ వాంటెడ్ నాయకుడు, బండి ప్రకాష్ @ ప్రభాత్ అనారోగ్య కారణాలతో తెలంగాణ ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు.
