👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మత్స్యకారుల సంక్షేమంతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో చేపల పెంపకం కీలక పాత్ర పోషిస్తోంది అని మత్స్యకారుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉందని
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ, వికలాంగుల, వయోవృద్దుల, మరియు ట్రాన్స్ జెండర్ ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ప్రభుత్వం ఆధ్వర్యంలో 100% సబ్సిడీపై ఉచిత చేప పిల్లలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం ,వెల్గటూర్ మండలం స్థంభం పల్లి గ్లోని కంపెల్లి చెరువులో 48,500 చేప పిల్లలను నేరుగా విడిచి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థల )బి. రాజ గౌడ్ పాల్గొన్నారు.

అనంతరం వెల్గటూర్ మండలానికి చెందిన 29 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అధికారులతో కలిసి అందజేశారు. కార్యక్రమానికి ముందుగా మంత్రి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ..
మా ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. చెరువుల పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్యాల పెంపు, మార్కెట్ సదుపాయాల విస్తరణ ఈ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని మంత్రి అన్నారు. మత్స్యకార కుటుంబాల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి గ్రామానికి విస్తరిస్తామని తెలిపారు.స్థంభం పల్లి గ్రామం మత్స్యోత్పత్తిలో మరింత అభివృద్ధి చెందాలని ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది” మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

జగిత్యాల జిల్లాలో 765 చెరువులలో ₹ 2.44 కోట్ల విలువైన 1.69 కోట్ల ఉచిత చేప పిల్లలను పంపిణీ చేయడం జరుగుతుందని వీటి విడుదల లక్ష్యాన్ని త్వరగా పూర్తిచేయాలనీ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా మత్స్య శాఖ అధికారి కె. సురేష్ బాబు, వెల్గటూర్, ఎండ పెల్లి మండలాల ఎమ్మార్వో లు, ఎంపిడివోలు,మత్స్య శాఖ అధికారులు చిట్యాల గంగాధర్, అశోక్, గణేష్, ఇతర అధికారులు, మత్స్యకారులు మరియు తదితరులు పాల్గొన్నారు.
