J.SURENDER KUMAR,
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్ మార్కెట్ లో తిరుగుతూ మార్నింగ్ వాక్ చేస్తున్న వాకర్స్ ను కలిసి ఓట్ల అభ్యర్థిస్తున్నారు.

మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు మార్నింగ్ వాకర్స్ తో కలిసి ప్రచారం చేయడంతో పాటు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా మంత్రులు కోరుతున్నారు.

మార్కెట్లలో ,ఆలయాల ముందు, చిరు వ్యాపారులను సైతం కలసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుకు సహకరించండి అంటూ మంత్రులు ఓటర్లను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నారు.
