నేడు ధర్మపురిలో ట్రాఫిక్ ఆంక్షలు!

👉 కార్తిక పౌర్ణమి సందర్భంగా…

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

👉 స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి ప్రకటన మేరకు...

పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ధర్మపురి  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం కోసం సారీ సంఖ్యలో భక్తజనం తరలి రానున్న నేపథ్యంలో పోలీస్  శాఖ కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టింది.

👉 దేవాలయం వరకు వాహనాలకు అనుమతి లేదు !

భక్తుల వాహనాలను ఆలయం వరకు అనుమతి లేదు
బ్రాహ్మణ సంఘం, ఇసుక స్తంభం, నంది విగ్రహ చౌరస్తా, ఆర్యవైశ్య సత్రం నుండి ఆలయం వరకు వచ్చే వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని ఆయన పోలీస్ శాఖ పేర్కొంది.

👉 వాహనాల పార్కింగ్ స్థలం !

భక్తులు తమ వాహనాలను నందివిగ్ర చౌరస్తా, కూరగాయల మార్కెట్, హరిత హోటల్, మంగళిగడ్డ, బ్రాహ్మణ సంఘం వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో తమ వాహనాలను పార్కింగ్ చేసి కాలినడకతో ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలని కోరారు.

👉 గోదావరి నదిలో స్నానం ఆచరించే భక్తులకు పోలీసు సూచనలు !

👉 దయచేసి లోతైన నీటిలోకి వెళ్లకండి.

👉 మద్యం సేవించి నదిలోకి దిగకండి.

👉 చిన్నపిల్లలు, వృద్ధులు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే స్నానం చేయాలి.

👉నదిలో స్నానం చేస్తున్నప్పుడు జారిపడే అవకాశం ఉంటుంది – జాగ్రత్తగా కదలండి.

👉 విలువైన వస్తువులు (మొబైల్ ఫోన్‌లు, నగలు మొదలైనవి) తీసుకెళ్లవద్దు.

👉 స్థానిక పోలీసుల, రెవెన్యూ, నదీ భద్రతా సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించండి.

👉 ఎవరైనా ప్రమాదంలో ఉన్నట్లు గమనించిన వెంటనే సమీప పోలీసు సిబ్బందికి తెలియజేయండి.

👉 గోదావరి ఘాట్ల పరిసర ప్రాంతాల్లో పార్కింగ్, రోడ్డు రవాణా, క్యూలు తదితరాలపై సూచనలు పాటించండి.

👉 అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనపడితే వెంటనే 100 / Dial 112 కు సమాచారం ఇవ్వండి.

👉 భక్తులందరూ శాంతి, భద్రతతో స్నానం ఆచరించగలిగేలా పోలీసులకు సహకరించండి.