నిరుపేదలకు సొంతింటి కల మా ప్రభుత్వంలో సాకారం !

👉 ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో..

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !

J . SURRENDER KUMAR,

ఇందిరమ్మ రాజ్యంలోనే నిరుపేదలకు సొంత ఇంటి కల మా కాంగ్రెస్ ప్రభుత్వంలో సకారం అవుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ,వయో వృద్దులు, వికలాంగుల, మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. అర్హులైన నిరుపేదలందరికి ఇందిరమ్మ పథకం ద్వారా ఇండ్లు మంజూరయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.

పెగడపల్లి మండలం ల్యాగల మర్రి గ్రామంలోని మంగళవారం కుందేల లక్ష్మి భర్త రాజు కి ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు మంజూరు కాగా ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోని నూతన గృహప్రవేశ కార్యక్రమానికి  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్బంగా  మంత్రి మాట్లాడుతూ..

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణంలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి కోరారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి బిల్స్ పొందాలని సూచించారు.
అర్హులైన లబ్ధిదారులు గ్రామాల్లో ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు.

ఈరోజు గృహప్రవేశం చేసుకుంటున్న కుందేల లక్ష్మి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. వారిలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ వచ్చిన వారందరూ త్వరగా నిర్మాణ పనులు ప్రారంభిచాలని సూచించారు. లేనియెడల ఇతర అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించారు.

👉 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

ఇందిరమ్మ పథకం ద్వారా పైలెట్ ప్రాజెక్టు లో భాగంగా మంజూరైనా కుందేలు లక్ష్మి ఇందిరమ్మ ఇల్లును సకాలంలో పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు.

వీరిని ఆదర్శం గా తీసుకొని ప్రొసీడింగ్స్ తీసుకున్న లబ్ధిదారుల నిర్మాణం పనులు పూర్తి చేసి త్వరగా గృహప్రవేశాలు చేసుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమం లో హౌసింగ్ డిఈ భాస్కర్, ఎమ్మార్వోలు, ఎంపిడివోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.