👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
నా రాజకీయ ప్రస్థానంలో నేను నా నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండకపోవడంతో పాటు నా నియోజకవర్గాన్ని 12 రోజుల పాటు వదిలి ఉండడం ఇదే ప్రథమం అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న నా మనసంతా నా నియోజకవర్గ ప్రజల దగ్గరే ఉందనీ మంత్రి అన్నారు.
గురువారం మంత్రి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

👉 అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు..
కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ డివిజన్ బాధ్యతలను మంత్రి శ్రీధర్ బాబుతో కలసి ప్రచారం చేపట్టినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ఈకారణంగా నేను నా నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండలేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు పూర్తికాగానే నా నియోజకవర్గ ప్రజలను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది,” అని మంత్రి భావోద్వేగంతో అన్నారు.
👉 ధర్మపురి దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా బహుజన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్‌కు రెండు రోజుల ముందే బీఆర్‌ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది,” అని ఎద్దేవా చేశారు.
👉 సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జెండా ఎగురబోతోందన్నారు. గత పది సంవత్సరాలుగా దొరల పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవించారు. మార్పు కోరుకున్న ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్లీ చూడాలని ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు, అని చెప్పారు.
👉 మా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగుతుందనీ …. ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం, అని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

👉 గత ప్రభుత్వంలో అడ్డు అదుపు లేకుండా చేసిన విపరీతమైన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్న, ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఏ విధంగానైనా అమలు చేస్తామని పునరుద్ఘాటించారు.. పేదల సంక్షేమం, బహుజనుల అభ్యున్నతే మా ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు.
👉 ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్ సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. త్వరలోనే ధర్మపురి డిగ్రీ కాలేజీకి శాశ్వత భవనం నిర్మాణం ప్రారంభమవుతుంది,” అని తెలిపారు.
👉 , “దళిత, బీసీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు (స్కిల్ సెంటర్) ఏర్పాటు చేయడం మా ప్రాధాన్యతలో భాగమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
