పట్నాల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి  లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండలంలోని శ్రీ పర్వతాల మల్లికార్జున స్వామి వారి పట్నాల మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధల తో ఘనంగా జరిగాయి.  ఈ ఉత్సవానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవస్థానాల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహోత్సవం నిర్వహణలో దేవస్థాన కమిటీ, స్థానికులు చేసిన ఏర్పాట్లు అభినందనీయమని అన్నారు.