👉 మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
లోకమాత పోచమ్మ తల్లి చల్లని చూపు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ఆ తల్లీ దీవెనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లురి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురానిపేట లో గల లోకమాత పోచమ్మ ఆలయం లో మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు.
ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘనస్వాగతం పలికారు. వేదంపండితులు వేద మంత్రోచ్చరణలతో మంత్రి కి ఆశీర్వచనం చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రి తో పాటు, ఇతర అతిథులను ఆలయం కమిటీ పక్షాన శాలువాలతో సత్కరించారు.
👉 పూజల అనంతరం మంత్రి మాట్లాడుతూ…

కోరిన కోర్కెలు తీర్చే తల్లీ లోకమాత పోచమ్మ తల్లీ అని, ఆ తల్లిని దర్శించుకోవడం సంతోషకరంగా ఉందన్నారు. గతంలో తాను డిసిసి అధ్యక్షునిగా ఎన్నిక అయ్యాక ఒకసారి, ధర్మపురి లక్ష్మి నర్సింహా స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకసారి, విప్ హోదాతో పాటు ప్రస్తుతం మంత్రి హోదాలో సైతం అమ్మవారి దర్శనం చేసుకున్నట్లు లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు, కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పై అమ్మవారి చల్లని చూపు ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రిగా తనకు ఆశీర్వాదం అందించి, ప్రభుత్వం అమలు చెయ్యాల్సిన హామీల అమలుకు శక్తిని ఇవ్వాలని కోరారు. ఏ హోదాలో ఉన్న తనకు వీలైనప్పుడల్లా అమ్మవారిని దర్శించుకుంటానని ఆయన పేర్కొన్నారు.

మంత్రి లక్ష్మణ్ కుమార్ వెంట డిసిసి అధ్యక్షులు గాజేంగి నందయ్య, పొలాస మాజీ సర్పంచ్ గాజేంగి భారతి, టిపిసిసి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బండ శంకర్, మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ ఆడువాలా జ్యోతి లక్ష్మణ్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కండ్లపల్లి దుర్గయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భీరం రాజేష్, మాజీ కౌన్సిలర్ లు గాజుల లత మునిందర్, గుగ్గిళ్ల హరీష్, ప్రముఖ సామజిక సేవకులు గోపాల చారి, RTA సభ్యులు కమాటాల శ్రీనివాస్, ఆలయ కమిటీ నిర్వహణ కర్త గాజుల రాజేందర్ తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
