J.SURENDER KUMAR,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా బుధవారం ప్రజాభవన్‌లో జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.
ఈకార్యక్రమానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మె ల్యేలు, బిజెపి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, ప్రముఖ సినీ నటులుచిరం జీవి, బ్రహ్మానందం, సుబ్బిరామిరెడ్డి, జయసుధ, తదితరులు హాజరయ్యారు.
👉 సీఎంను కలిసిన ప్రొబెషనరీ ఐపీఎస్‌లు !

ముఖ్యమంత్రి . రేవంత్ రెడ్డి ని పలువురు ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రొబెషనరీ ఐపీఎస్‌లు ఆయేషా ఫాతిమా , మనీషా నెహ్రా , మంధరె సోహన్ సునీల్ , రాహుల్ కాంత్ ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఉన్నారు. వీరితోపాటు ఆర్‌బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్త్ ఉన్నారు.
👉 తెలుగు,ఇంగ్లీషు భాషలో ముద్రించిన భారత రాజ్యాంగం విడుదల !

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ న్యాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు,ఇంగ్లీషు భాషలో ముద్రించిన భారత రాజ్యాంగం ద్విభాషా గ్రంథాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సమగ్రంగా తెలుగులో అందించడం అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.
రాజ్యాంగం తెలుగు భాషలో ప్రచురించడం వల్ల భాష, సంస్కృతిని కాపాడటంతో పాటు భావి తరాలు, మేథావులు, సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయుక్తంగా అందుబాటులో ఉంటుందని చెప్పారు. తెలుగులో తర్జుమా చేసి సమగ్రంగా రాజ్యాంగాన్ని తెలుగు – ఇంగ్లీషు ద్విభాషలో అందించడం వల్ల అనేక విషయాల్లో స్పష్టత ఉంటుందని, ముఖ్యంగా తెలుగు వారికి, సామాన్యులకు సులభంగా రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకోవడానికి వీలవుతుందని అన్నారు. ఈ రాజ్యాంగ ప్రతులను విడుదల చేసిన సందర్భంగా న్యాయ శాఖ కార్యదర్శి పాపిరెడ్డి ఆ శాఖ ఇతర అధికారులు ఉన్నారు.
