రేపటి నుండి శ్రీ ధన్వంతరి జయంతోత్సవాలు !

👉 జగిత్యాల సూర్య ధన్వంతరి దేవాలయంలో..

J SURENDER KUMAR,

శ్రీ ధన్వంతరి జయంతోత్సవము మరియు శ్రీ ధనలక్ష్మి సమేత శ్రీ ధన్వంతరి స్వామి కళ్యాణ మహోత్సవము ఆదివారం నుండి మంగళవారం వరకు ( 16 నుండి 18 వరకు) అంగరంగ వైభవంగా జరగనున్నట్టు శ్రీ భగవాన్ ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ సేవా సమితి మరియు ఆలయ కమిటి సభ్యులు, నిర్వాహకులు తెలిపారు.

👉 ఆదివారము రోజున సుప్రభాత సేవ
ఉత్సవమూర్తులకు  అభిషేకము వివిధ పూజాది కార్యక్రమములు !

👉 సోమవారము  ఉ॥ 10:15ని॥లకు సుదర్శన సమేత శ్రీధన్వంతరి మూల మంత్ర యాగము !
పగలు 2:00గం॥ లకు ఆయుర్వేద పరంపర మూళిక వైద్య మహాసంఘం వైద్యులకు సన్మానం!

👉 మంగళవారము  ఉ॥ 10:15ని॥లకు శ్రీ ధనలక్ష్మి సమేత, శ్రీధన్వంతరి స్వామి వారి కళ్యాణ మహోత్సవము,పగలు 12:30 ని॥లకు అన్నప్రసాద వితరణ !

👉 వివరాలకు :  94931 46108 సంప్రదించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.