J.SURENDER KUMAR,
రైతాంగం రాత్రి పగలు కష్టపడి తమ రక్తంను చెమటగా మార్చి పండించిన పంటల కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా మార్కెట్ అధికార యంత్రాంగందే అని ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

మంథని పట్టణం పోచమ్మవాడ లో బుధవారం స్థానిక సింగిల్ విండో ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..

కొనుగోలు కేంద్రాలలో ధాన్యం త్వరితగతిన కొనుగోలు చేయాలని, రైతాంగానికి గిట్టుబాటు దర చెల్లించాలని, తాలు, తప్ప, నాణ్యత ప్రమాణాలు అంటూ రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి ఆదేశించారు. ధాన్యం తూకంలో తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిరంతరం అధికార యంత్రాంగం పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
👉 టెన్నిస్ కోర్ట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు !

మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నూతనంగా ₹ 44 లక్షలతో నిర్మించిన సింథటిక్ టెన్నిస్ కోర్ట్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, పట్టుదలకు, విజయ లక్ష్యాల సాధనకు వేదిక అని మంత్రి అన్నారు. ప్రారంభించిన అనంతరం విద్యార్థులతో కలసి మంత్రి టెన్నిస్ ఆడారు.
