👉 ధర్మారం మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గ్రామస్థాయి లో అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలతో పాటు గ్రామాభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు గ్రామ సర్పంచ్, సభ్యుల పనితనం పాత్ర కీలకమని సమిష్టి నిర్ణయంతోనే సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సిందిగా ఎస్సీ ఎస్టీ దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…
త్వరలో జరగనున్న గ్రామ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతున్న ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టి నిర్ణయంతో సర్పంచు వార్డు సభ్యులను ఎంపిక చేసుకొని వారి గెలుపుకు కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
గ్రామస్థాయి ఎన్నికలు పార్టీకి అత్యంత కీలకమని, ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం శ్రమించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేయాలని మంత్రి కోరారు.
రెండు సంవత్సరాల కాలంలోనే రైతు రుణమాఫీ, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, ₹500కు గ్యాస్ సిలిండర్, విద్యుత్తు రాయితీ, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి, రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
రానున్న మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామాలలో మహిళా అభివృద్ధి మరిన్ని సంక్షేమ పథకాలు అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కార్యకర్తలకు వివరించారు.
గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసి, పార్టీ విజయాన్ని సాధించేందుకు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మండల నాయకులు, సీనియర్ కార్యకర్తలు, యూత్ మరియు మహిళా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
